నిన్న మొన్నటివరకు రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీసిన కొన్ని నగరాల్లో మాత్రం ఉహించని విధంగా మారుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ డిమాండ్ నగరం చివరికి మళ్లింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని చాల చోట్ల వెంచర్లు, ఫ్లాట్స్, ఇళ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు హైదరాబాద్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది క్రితం 6,268 యూనిట్ల నుండి 2024 నవంబర్‌లో 12% ఇయర్ ఆన్ ఇయర్ (YoY) తగ్గి 5,516 యూనిట్లకు పడిపోయాయి. డిసెంబర్ 24న నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు 5,894 నుండి ప్రతినెల (MoM) 6% పడిపోయాయి. ఇంకా హైదరాబాద్ నవంబర్ 2024లో రూ.3,495 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి, ఈ లెక్కలు గత ఏడాది రూ.3,741 కోట్ల నుండి సంవత్సరానికి 7% తగ్గుదలని చూపిస్తుంది.
"హైదరాబాద్‌లో మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు నవంబర్ 2024లో పడిపోయాయి, అయితే ఎక్కువ విలువైన ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంది, ఏడాది ప్రాతిపదికన 3% పెరుగుదలను నమోదు చేసింది. కస్టమర్ల ప్రాధాన్యతలు 1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న పెద్ద, ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లుతున్నాయి, ఇది లగ్జరీ లైఫ్ పై పెరుగుతున్న ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు. హైదరాబాద్ ఇళ్ల మార్కెట్ నాలుగు జిల్లాలలో ఉంది, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి ఇంకా సంగారెడ్డి. ఇళ్ల రిజిస్ట్రేషన్లు మొత్తం మీద తగ్గినప్పటికీ, ఎక్కవ రేటు ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఒక నివేదిక పేర్కొంది.

2023తో పోల్చితే 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా నవంబర్ 2024లో 12% నుండి 14%కి పెరిగింది. నవంబర్ 2024లో హైదరాబాద్‌లో అత్యధికంగా రిజిస్టరైనా ఆస్తులు 1,000 నుండి 2,000 చదరపు అడుగుల (చదరపు అడుగులు) పరిధిలో ఉన్నాయి, వీటికి మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 69% వాటా ఉంది.
జిల్లా స్థాయిలో చూస్తే మేడ్చల్-మల్కాజిగిరి ఆస్తిల రిజిస్ట్రేషన్లలో 42%, రంగారెడ్డి తరువాత 41%గా ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 17% హైదరాబాద్ జిల్లా వాటాగా ఉంది. జనవరి నుండి నవంబరు మధ్య హైదరాబాద్ రూ. 43,574 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్ చేసింది, అదే కాలంలో గత ఏడాది రూ.34,205 కంటే 27% వృద్ధిని నమోదు చేసింది. రిజిస్ట్రేషన్ల సంఖ్య గతేడాది 64,658 యూనిట్ల నుంచి 70,796 యూనిట్లకు ఏడాదికి 12% పెరిగింది.


Click it and Unblock the Notifications