హ్యాపీ న్యూ ఇయర్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్... 2020 లో దూకుడే!

చారిత్రక హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గత 25 ఏళ్లుగా స్వర్గధామంలా నిలుస్తోంది. ఇక్కడ భూములు కొన్నవారు, ఇల్లు కొన్న వారు, అపార్టుమెంట్లో ఫ్లాట్ కొన్న వారు అందరూ బాగుపడినవారే. కొంటున్నప్పుడు ఆమ్మో అంత రేటా అనిపిస్తుంది కానీ కొన్నాక ఒక ఐదేళ్లు ఆగితే మన పెట్టుబడికి రెట్టింపు విలువ పెరగటం ఈ నగరానికే చెల్లింది. అందుకే ఈ ముత్యాల నగరంపై మన తెలుగు వారే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు మోజు పడుతున్నారు. ఒకటేమో పెట్టుబడుల కోసం అయితే... మరోటేమో రిటైర్ అయ్యాక హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోదామని.

ఎందుకంటే మన హైదరాబాద్ లో మాత్రమే దేశంలోని అన్ని ప్రధాన మెట్రో సిటీల్లో కంటే తక్కువ ధరకు స్థలం, ఇల్లు దొరుకుతాయి. ప్రపంచస్థాయి నగరం అయినప్పటికీ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అన్ని రకాల ఆహారం దొరుకుతుంది. అన్ని భాషల వారూ హ్యాపీగా తమ భాషలోనే మాట్లాడే అద్భుత నగరం మనదని గర్వంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్, కాలేజీ లు అనేకం కొలువై ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఐన వెంటనే తగిన కొలువు దొరికేందుకు తగినన్ని సాఫ్ట్ వేర్, ఫార్మా, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు ఇక్కడ తమ ఇండియా హెడ్క్వార్టర్స్ కట్టేశాయి. దేశంలో బెంగళూరు తర్వాత అత్యధిక వేతనాలు లభించే సిటీ కూడా మన హైదరాబాదే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం దేశంలో అత్యధికులు సందర్శించిన నగరం కూడా భాగ్యనగరమే కావటం విశేషం.

మన సిటీ ప్రత్యేకం...

మన సిటీ ప్రత్యేకం...

ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత దేశంలో రియల్ ఎస్టేట్ అంతగా పుంజుకోలేదు. మరీ ముఖ్యం రెండేళ్లుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు తగ్గటం కనిపించింది. కానీ ఒక్క మన హైదరాబాద్ మాత్రం అంతకంతకూ తన ర్యాంకు ను మెరుగు పరచుకుంటూ ముందుకు సాగిపోతోంది. అమ్మకాలు పెరుగుతున్నాయి. ధరలూ పెరుగుతున్నాయి. వినియోగదారుల అవసరాల ప్రకారం రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని రకాల ప్రాపర్టీస్ ను మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. అంటే కస్టమర్ కు ఛాయస్ ఎక్కువ లభించే సిటీ కూడా హైదరాబాద్. ఎవరి బడ్జెట్ లో వారికీ తగిన ప్రాపర్టీ ఇక్కడ లభిస్తోంది. ఈ లక్షణమే బెంగుళూరు, ముంబై వంటి మహా నగరాల్లోని భారీ రియల్ ఎస్టేట్ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించింది. ఇక్కడ మెజారిటీ వెంచర్స్ పొరుగు రాష్ట్రాల డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్నావే కావటం విశేషం.

ఆకాశ హర్మ్యాలు...

ఆకాశ హర్మ్యాలు...

ఒకప్పుడు హైదరాబాద్ లో అతి పెద్ద భవనం అంటే నాంపల్లిలోని బాబు ఖాన్ ఎస్టేట్ కనిపించేది. ఇప్పుడు అలంటి బిల్డింగ్ లకు లెక్కే లేదు. మన దగ్గర 25 అంతస్తులు చాలా కామన్ అయిపోయింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో అయితే ఏకంగా 30-35 అంతస్తుల భవంతులు అనేకం కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాలను చూస్తుంటే... మనం అసలు హైదెరాబా లోనే ఉన్నామా లేదా న్యూయార్క్ వంటి మహా నగరం లో ఉన్నామా అన్నంత ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత పెద్ద భవనాలు వచ్చినప్పటికీ ... ముంబై లో అదే స్థాయి అపార్ట్మెంట్ ధర సగటున చదరపు అడుగు స్థలం రూ 20,000 నుంచి రూ 25,000 పలుకుతుంటే... హైదరాబాద్ లో మాత్రం రూ 7,000 నుంచి రూ 10,000 మధ్యలో లభిస్తోంది. ఇదే మన సిటీ స్పెషలిటీ. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇది కూడా ఆకాశ హర్మ్యాలు పెరగటానికి ఒక కారణమే. ఇటీవల హైదరాబాద్ లోని వేవ్రాక్ అనే ఆఫీస్ స్థలాన్ని ఒక విదేశీ కంపెనీ రూ 1,800 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ డీల్ 2019లో ఇండియా లో జరిగిన అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డీల్ ఇదే కావటం విశేషం.

అందరికీ అన్నీ...

అందరికీ అన్నీ...

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో చాయిస్ ఎక్కువ. ఇక్కడ ఇండిపెండెంట్ ఇల్లు కావాలంటే దొరుకుతుంది. ఫ్లాట్ కావాలంటే లభిస్తుంది. విల్లా కావాలంటే వెంటనే కొనేయొచ్చు. మీరు అడగండి ... మేం కట్టిస్తాం అని బిల్డర్లు సిద్ధంగా ఉంటారు. మిగితా సిటీల్లో ఇన్ని ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ నగరానికి అలంటి అడ్డంకులేమి లేవు. నగరానికి మని హారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు సిటీ విస్తరణకు అవకాశం ఉంది. విశాలమైన రోడ్లు, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ మనకే సొంతం. ఢిల్లీ తర్వాత దేశంలో సూపర్ హిట్ ఐన మెట్రో రైల్ కూడా హైదరాబాదే కావటం విశేషం. ఈ అవకాశాలను చూసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ దేశంలోనే అతిపెద్ద వేర్హౌస్లు ఇక్కడే కట్టాయి. చక్కటి వాతావరణం, సమ దూరం కూడా కలిసివస్తోంది. హైదరాబాద్ లో ఏటా సుమారు 25,000 నుంచి 30,000 ఉంటిలా ఫ్లాట్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇవి అధికారిక అంచనాల ప్రకారం. ఇవి కాకుండా ప్రైవేట్ అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. కొన్ని మిల్లియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వస్తోంది. అందుకే హైదరాబాద్ లో ఎవరికీ ఏం కావాలంటే అది దొరుకుతుంది. అంతలా అభివృద్ధి చెందింది మన నగరం.

గ్లోబల్ కంపెనీలు...

గ్లోబల్ కంపెనీలు...

హైదరాబాద్ లో గ్లోబల్ కంపెనీల ఇండియా హెడ్ ఆఫీసులు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్ వంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలే కాకుండా వందల సంఖ్యలో గ్లోబల్ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. మన మన దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా వాటి ప్రపంచ అతి పెద్ద డెలివరీ సెంటర్లు ఇక్కడే స్థాపించాయి. దేశంలో ఎక్కడ ఉన్నా లేకున్నా హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కచ్చితంగా ఉండాలన్నంతగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఎందుకంటే మన దగ్గర మానవ వనరుల లభ్యత అధికంగా ఉంది. ఎలాంటి కొత్త టెక్నాలజీ వచ్చినా ... దానిని వెంటనే నేర్చుకుని నిపుణ్యం సాధించటంలో మన వాళ్ళు ముందుతున్నారు. అందుకే గ్లోబల్ కంపెనీలన్నీ మన సిటీకి విస్తరిస్తున్నాయి.

ఎంత పెరగొచ్చు...

ఎంత పెరగొచ్చు...

వినడానికి ఇవన్నీ బాగున్నాయి కానీ... మా పెట్టుబడులకు ఎంత మేరకు ప్రతిఫలం వస్తుంది అనేదే కదా మీ అనుమానం? మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం... ఇక్కడ పెట్టుబడులు సగటున 20 శాతం వృద్ధి చెందుతున్నాయి. ఆర్థిక మందగమనం వెంటాడుతున్నప్పటికీ గత రెండేళ్లలో ఇక్క ప్రాపర్టీ విలువ సుమారు 30-35% పైగా పెరిగాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లో విలువలు స్థంభించినప్పటికీ మన వద్ద పరుగులు పెడుతున్నాయి. అందుకే ఈ 2020 ఏడాది లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి 2025 నాటికీ దాదాపు రెట్టింపు విలువ లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పెరుగుదల ఒక్కో ప్రాపర్టీ కి ఒక్కోలా ఉంటుందని, ఇది కేవలం సగటు అంచనా మాత్రమేనని వారు వివరిస్తున్నారు. సహజంగానే స్థలాల ధరలు వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు. సో మారేందుకు ఆలస్యం... పెట్టుబడులతో సిద్ధంకండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+