Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కీలక పాత్ర పోషిస్తోంది.నగర రియాల్టీ మార్కెట్‌కు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం బలమైన వెన్నెముకలా మారింది. ఐటీ ఉద్యోగుల ఉపాధి అవకాశాలు, ఆదాయ స్థాయిల పెరుగుదలతో నగరంలో గృహాల కొనుగోళ్లకు తోడ్పాటునిస్తూ.. పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాల అవసరాన్ని కూడా పెంచుతోంది.
ఒకప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఐటీ కార్యకలాపాలు.. Telangana government Growth in Dispersion (GRID) పాలసీతో నగరం నలువైపులా విస్తరించాయి.GRID పాలసీలో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు వెంబడి ఉన్న 11 పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా రేవంత్ రెడ్డి సర్కారు అభివృద్ధి చేసింది.ఇక కొత్తగా కొంపల్లి, కొల్లూరులో ఐటీ టవర్లు, ఐటీ పార్కులు నిర్మించబడుతున్నాయి. దీంతో పశ్చిమ భాగాన్ని దాటుకుని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కూడా ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల పరంగా హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుతం నగరంలో 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా, 2025 ముగింపు నాటికి ఇది 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనున్నట్లు జేఎల్‌ఎల్ సర్వే అంచనా వేసింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద కార్యాలయాల స్థల మార్కెట్‌గా హైదరాబాద్ ఎదిగింది.
కార్యాలయ స్థలాలతో పాటు, ఉత్తర హైదరాబాద్‌లో కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్, తూర్పు హైదరాబాద్‌లో ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి ప్రాంతాల్లో నివాస మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ ఉద్యోగుల ఆదాయ స్థాయిల పెరుగుదల ఈ ప్రాంతాలలో గృహాల కొనుగోళ్లను పెంచుతోంది. అందువల్ల అందుబాటు గృహాలకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది.
గత ఆరేళ్లలో హైదరాబాద్ గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో 81% వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో బెంగళూరు 47% వృద్ధిని మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ వాటా ఇటీవల 12.7% నుండి 25%కి పెరిగింది. ఇది నగరానికి పెట్టుబడుల ఆకర్షణలో కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. గ్రిడ్ పాలసీ (growth in dispersion) అమలుతో హైదరాబాద్ నగరంలో ఐటీ విస్తరణ వేగంగా జరుగుతోంది.
500 మందికి పైగా ఉపాధి కల్పించే ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. సంబంధిత భూమిని 50% ఐటీ ప్రయోజనాలకు, మిగిలిన 50% నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చునన్న వెసులుబాటు ప్రస్తుతం డెవలపర్లను ఆకర్షిస్తోంది. ఇప్పటికీ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ప్రధానంగా హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలపై ఆధారపడుతుంది. ఇక్కడే 96% గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ నెలకొనిఉంది. కానీ కొత్త పాలసీలతో నగరం నలువైపులా ఆఫీస్ స్పేస్‌లు విస్తరిస్తున్నాయి.
ఇక రియాల్టీలో పశ్చిమ హైదరాబాద్ దూసుకెళుతోంది. తెల్లాపూర్, బాచుపల్లి, అత్తాపూర్ రియల్టీ హాట్‌స్పాట్స్‌గా ఎదుగుతున్నాయి. గత మూడు త్రైమాసికాల్లో నగరంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులలో 57 శాతం పశ్చిమ హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఉత్తర హైదరాబాద్‌లో 18 శాతం, తూర్పు ప్రాంతాల్లో 15 శాతం, కేంద్ర ప్రాంతంలో 8 శాతం, దక్షిణ హైదరాబాద్‌లో 2 శాతం ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, నల్లగండ్ల, కొత్తగూడ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్టీ హబ్‌లుగా నిలుస్తున్నాయి.
ఇక దక్షిణంలో అత్తాపూర్ కూడా కొత్త గృహ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడుల కన్నా సొంత ఇల్లు నిర్మించుకోవాలని చాలా మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఎక్కువగా విల్లా, లగ్జరీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరహా ప్రాజెక్టులు విస్తృతంగా గ్రీన్ స్పేస్‌లు, ఆధునిక వసతులు, భద్రతా ప్రమాణాలు కలిగి ఉండటంతో కొనుగోలుదారుల నుంచి మక్కువ అందుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications