భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఎప్పటికప్పుడు దూసుకుపోతోంది. ముఖ్యంగా టెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో, ORR కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాల కారణంగా ఈ నగరం రాబోయే దశాబ్దంలో పెట్టుబడిదారులకు అత్యంత విలువైన గమ్యస్థానంగా మారుతోంది. 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి మూడు ప్రధాన కారణాలను నిపుణులు చెబుతున్నారు. నిరంతర ఐటీ విస్తరణ, బలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అలాగే స్థిరమైన అద్దె, మూలధన వృద్ధితో నగరం రియాల్టీలో పరుగులు పెడుతుందని చెబుతున్నారు.
కాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పశ్చిమ కారిడార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఏరియాలతో ఈ కారిడార్ ఇప్పటికే టాప్ లో ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఐటీ దిగ్గజాల ప్రధాన కేంద్రాలు ఇక్కడే ఉండటంతో, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, అధిక అద్దె రాబడులు నిరంతరం పెరుగుతున్నాయి. 2025 నాటికి చదరపు అడుగుకు రూ. 10 వేల నుంచి రూ. 13 వేల రేంజ్‌లో ధరలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

కోకాపేట్, నార్సింగి ప్రాంతాలు తరువాతి స్థానంలో దూసుకుపోతున్నాయి. రాబోయే మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే కనెక్టివిటీ, ప్రీమియం విల్లాలు, సరసమైన అపార్ట్‌మెంట్‌లు కలిపి ఇక్కడి ప్రాపర్టీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇక మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లో అంతర్జాతీయ పాఠశాలలు, ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్ సమీపంలో ఉండటం వలన ఈ మైక్రో మార్కెట్లు సంవత్సరానికి 7 నుంచి 10 శాతం ధర పెరుగుదలను ఇస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 15 శాతం వరకు ఉంది.
దక్షిణ హైదరాబాద్ విషయానికి వస్తే.. విమానాశ్రయం, ఫార్మా సిటీ కారణంగా దక్షిణ హైదరాబాద్ రాబోయే ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్‌లో కొత్త కథను రాసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్ ప్రాంతంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీ, రాబోయే ఎయిర్‌పోర్ట్ మెట్రో, ORR యాక్సెస్ కారణంగా.. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
అలాగే మహేశ్వరం, మామిడిపల్లి ప్రాంతాల్లో కూడా పుల్లు డిమాండ్ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ సమీపంలో ఉండటం వలన ఈ ప్రాంతాలు ఓపెన్ ప్లాట్ల పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారాయి. నిపుణులు 3-5 ఏళ్లలో భూమి విలువ రెట్టింపు కావచ్చని చెబుతున్నారు. ఇక ఆదిబట్ల, ఎల్బీనగర్ ప్రాంతాలు కూడా రియాల్టీ పుంజుకుంటోంది. ఏరోస్పేస్, ఐటీ క్లస్టర్లు, బడ్జెట్ హౌసింగ్ వల్ల ఇక్కడ పెట్టుబడులు మొదటిసారి ఇల్లు కొనేవారికి, NRIలకు బలమైన ఎంపికగా నిలుస్తోంది..
కొత్తగా వస్తున్న హబ్ ల విషయానికి వస్తే.. పశ్చిమం, దక్షిణం కంటే బయట కూడా కొన్ని కొత్త ప్రదేశాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.కొంపల్లి, బాచుపల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. బడ్జెట్ గృహాల మార్కెట్‌గా పేరుగాంచుతున్న ఈ ప్రాంతాలు ORR కనెక్టివిటీ కారణంగా భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి.
ఇక కొల్లూరు, మోకిల ప్రాంతాల్లో కూడా భూములకు డిమాండ్ ఏర్పడింది. సబర్బన్ టౌన్‌షిప్‌లు, పచ్చని వాతావరణం, ఐటీ కారిడార్‌కు సులభమైన చేరిక కారణంగా ఈ ప్రాంతాలు మిడిల్ క్లాస్, యువ ప్రొఫెషనల్స్ కోసం సరైన పెట్టుబడి కేంద్రాలుగా మారుతున్నాయి. అలాగే తెల్లాపూర్, శంకర్‌పల్లి కూడా పుల్లు డిమాండ్ అందుకుంటోంది. రాబోయే మెట్రో, బిజినెస్ పార్కులు, ప్రీమియం పాఠశాలలు ఉన్నందువల్ల ఇక్కడ ప్రాపర్టీలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది.
2025లో గచ్చిబౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు లగ్జరీ, అద్దె ఆదాయానికి బంగారు ప్రమాణంగా నిలుస్తాయి. దక్షిణంలో శంషాబాద్, మహేశ్వరం ఫార్మా సిటీ, ఎయిర్‌పోర్ట్ మెట్రో వల్ల బలంగా ఎదుగుతాయి. కొల్లూరు, మోకిల, కొంపల్లి వంటి కొత్త జోన్‌లు ముందుగానే పెట్టుబడి పెట్టే వారికి అధిక మూలధన వృద్ధి ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా 2025లో Hyderabad భారతదేశంలో అత్యంత వ్యూహాత్మక రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications