Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సంకేతాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలో భారీగా వృద్ధి కనిపించడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో దాదాపు 14 శాతం పెరుగుదల నమోదైంది. గత నెలలో రంగారెడ్డి జిల్లా 48 శాతం రిజిస్ట్రేషన్లు జరగగా.. మేడ్చల్-మల్కాజ్‌గిరి 37 శాతం, హైదరాబాద్ జిల్లా 15 శాతం రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అత్యధిక భాగం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరుగుతున్నాయి.
అయితే తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన లింక్డిన్ వేదికగా పోస్ట్ చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కీలక విషయాలను వెల్లడించారు.. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లో రియల్టీ బూమ్ ఉందని అందరూ అనుకుంటారు. కాని అది నిజం కాదు 2020 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుమ్మురేపిందని చెప్పుకొచ్చారు.

గత నాలుగేళ్ల కాలం నుంచి టాప్ మెట్రో నగరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ రియల్టీ రంగమే పెట్టుబడిదారులకు 80 శాతం ఆదాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ భారీ వృద్ధి ముందు మిగిలిన ప్రధాన నగరాలు చాలా తక్కువగానే వృద్ధి నమోదు చేశాయని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రియల్టీ 80 శాతం రాబడిని అందించగా రెండవ స్థానంలో నోయిడా 70 శాతం రాబడిని అందించిందని చెప్పారు. గుర్గావ్‌ను 60%తో రెండవ స్థానంలో నిలిచింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 45 శాతం రాబడి రాగా.. ఐటీ రాజధాని బెంగుళూరులో పెట్టుబడిదారులకు 45 శాతం రాబడిని అందించింది. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని రియల్టీ రంగం పెట్టుబడి దారులకు కేవలం 40 శాతం రిటర్న్స్ మాత్రమే అందించింది. ఇక కోలకత్తా 25 శాతం వరకు ఆదాయాన్ని అందించగా.. చెన్నై అత్యల్ప స్థాయిలో 20 శాతం రాబడిని మాత్రమే అందించిందని ఆహుజా చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే మరో సంస్థ నైట్ ఫ్రాంక్ 2024 నివేదిక హైదరాబాద్ లో సగటు వార్షిక వృద్ధి 6% నుంచి 14% వరకు ఉన్నట్లు వెల్లడించింది. నగరంలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎక్కువ రియల్టీ బూమ్ కొనసాగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. మే 2025లో కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ నగరంలో 37 శాతం పెరిగాయి. ఇవి మొత్తం రిజిస్ట్రేషన్లలో 19 శాతంగా ఉన్నాయి.
గత సంవత్సరం మేలో కోటి కన్నా ఎక్కువ ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు పధ్నాలుగు శాతమే ఉన్నాయి. 50 లక్షల కంటే తక్కువ , 50 లక్షల నుంచి 1 కోటి మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు వరుసగా 55 శాతం, 26 శాతం రిజిస్టర్ అయ్యాయి. మే 2025లో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిమాణంలోని ప్రాపర్టీలు 67 శాతం వరకు రిజిస్ట్రేషన్ అయ్యాయి.హైదరాబాద్ నగరం ఖచ్చితమైన 80% లాభం నిర్ధారించబడనప్పటికీ.. ఈ నగరం భారతదేశ ఆస్తి మార్కెట్‌లో అత్యంత నమ్మకమైనదానిలో ఒకటిగా నిలిచిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications