హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. గచ్చిబౌలిలో గజం రూ.1.12 లక్షలే.. హౌసింగ్ బోర్డు స్థలాల వేలం పాట పూర్తి వివరాలు ఇవే..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరోసారి ప్రముఖంగా వార్తల్లోకెక్కింది. దాని జోరు ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో హౌజింగ్ బోర్డుకు చెందిన భూములు బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలతో దూసుకుపోయాయి. ఐటీ సిటీ గచ్చిబౌలిలోని ఓ ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్ ని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయగా ఏకంగా రూ.33 కోట్లు పలికింది. మరో చోట ఇంకో ప్లాట్ రూ. 13.51 కోట్లతో దూసుకుపోయింది.

వీటితో పాటుగా రెండు MIG ప్లాట్లను కూడా సుమారు 4.50 కోట్లకు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు పోటీ పడ్డారు. మరో ఏరియా చింతల్ ప్రాంతంలో కూడా ప్లాట్లు వేలం వేయగా అవి కూడా రికార్డు స్థాయి ధరలు పలికాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆ ప్లాట్లను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మొత్తంగా హైదరాబాద్ లో 11 ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌజింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌజింగ్ కమిషనర్ వి.పి.గౌతం తెలిపారు.

Telangana Housing Board Auction in Hyderabad Gachibowli plot price 2025 Hyderabad real estate news Telangana Housing Board auction Gachibowli land rates Rs 2 22 lakh per square yard Gachibowli Hyderabad property investment Telangana flat auction Gachibowli real estate boom Hyderabad land sale record Telangana housing auction 2025 2025 Rs 2 22 2025

తెలంగాణ హౌజింగ్ బోర్డు అధికారులు సోమవారం హైదరాబాద్ లోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట తదితర ప్రాంతాల్లోని ప్లాట్లకు వేలం నిర్వహించారు. కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఈ వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో మొత్తం 55 మంది పాల్గొన్నారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల విస్తీర్ణంలో గల రెసిడెన్షియల్ ప్లాట్లు వేలం వేశారు. ఇక గచ్చిబౌలి ప్రాంతంలో కమర్షియల్ ప్లాట్లు వేలానికి వచ్చాయి. నిజాంపేటలో 413.43 చదరపు గజాల ప్లాట్లు కూడా ఈ ప్లాట్లతో కలిపి వేలం వేశారు.

హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో ఐటీ కారిడార్‌లోని ప్రధాన ప్రాంతమైన గచ్చిబౌలిలో గజం ధర అత్యధికంగా రూ.2.22 లక్షలు పలకగా.. 1200 గజాల పాఠశాలభూములకు తక్కువగా రూ.1.12 లక్షలు ధర పలికింది. దీని కనీస ధర గజానికి రూ. 80 వేలుగా నిర్ణయించారు. ఇక గచ్చిబౌలిలో 4 ప్లాట్లను అమ్మకానికి పెడితే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక చింతల్‌లో 10 ప్లాట్లను అమ్మకానికి పెడితే కేవలం 3 ప్లాట్లే కొనుగోలు చేశారు.

ఇక్కడ అధికారులు గజం రూ. 80 వేలుగా నిర్ణయిస్తే అత్యధిక ధర రూ. 1.14 లక్షలు పలికింది. తక్కువగా రూ. 86 వేలు పలికింది. వీటితో పాటు 10 ఖాళీ స్థలాలకు వేలం పాట పెడితే కేవలం 3 స్థలాలనే కొనుగోలు దారులు కొనుగోలు చేశారు. రెండు ఎంఐజి ప్లాట్లు చదరపు గజం రూ.1.86 లక్షలు, రూ.1.32 లక్షల ధరలు పలికాయి. ఒక్క గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించిన భూముల ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి రూ.55 కోట్ల 56 లక్షల 84 వేలు ఆదాయం వచ్చింది.

అలాగే నిజాంపేటలో 413.43 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 8 ప్లాట్లు వేలానికి ఉంచారు. అయితే వీటిలో నాలుగు ఫ్లాట్లు మాత్రమే సోల్ట్ అవుట్ అయ్యాయి. ఫ్లాట్ ధరను అధికారులు రూ.16.55 లక్షలుగా నిర్ణయించారు. వీటితో అత్యధిక ఫ్లాట్ ధర రూ.18.21 లక్షలు పలకగా అత్యల్ప ఫ్లాట్ ధర రూ.16.73 లక్షలు పలికింది. ఈ మొత్తం ప్లాట్లు, ఫ్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.65,01,91,176 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 22 ఆస్తులను వేలం వేయగా.. 11 ఆస్తులను మాత్రమే కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు.

కుత్బు ల్లాపూర్ మండలంలోని చింతల్ ప్రాంతంలోని హౌజింగ్ బోర్డు ఎంఐజి ప్లాట్లు కూడా అత్యధిక ధరలతో బహిరంగ వేలంలో అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలో మొత్తం 10 ప్లాట్లను వేలం వేయగా, వీటిలో ప్లాట్ నెం.113,114,115ల ద్వారానే సుమారు రూ.8.11 కోట్లమేర ఆదాయంవచ్చింది. నిజాం పేట బాచుపల్లిలోని 4 ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+