హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్.. ఈ ఏరియాలకే పుల్లు డిమాండ్..ఒక్క ఫ్లాట్ కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Hyderabad Real Estate Boom: భారతదేశపు సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు సవాల్ విసురుతూ శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రభుత్వ స్థిరత్వం, ఐటీ రంగం విస్తరణ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు భాగ్య నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాయి. ముఖ్యంగా నగరం యొక్క పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతూ కొత్త హాట్‌స్పాట్లుగా అవతరించాయి.

ఈ క్రమంలో కోకాపేట ప్రాంతం లగ్జరీ జీవనశైలికి కొత్త చిరునామాగా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు చేరువలో ఉండటం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'నియోపోలిస్' లేఅవుట్ వంటి కారణాలతో ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 10 వేల నుండి రూ. 16 వేల వరకు పలుకుతోంది. భారీ ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన విల్లాల నిర్మాణం ఇక్కడ పెట్టుబడులపై సుమారు 12 నుండి 15 శాతం వరకు రాబడిని అందిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Hyderabad real estate Kokapet property market Gachibowli real estate Tellapur property prices Shamshabad real estate Hyderabad property hotspots Hyderabad luxury apartments Hyderabad villas Hyderabad property investment Hyderabad realty news Kokapet investment Gachibowli IT hub Hyderabad housing market Shamshabad airport corridor Tellapur apartments Hyderabad real estate trends best areas to buy property in Hyderabad Hyderabad infrastructure growth Hyderabad commercial property Hyderabad residential market

మరోవైపు, దశాబ్దాలుగా ఐటీ హబ్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న గచ్చిబౌలి ప్రాంతం, ఇప్పటికీ పెట్టుబడిదారుల మొదటి ప్రాధాన్యతగా నిలుస్తోంది. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 12 వేల నుండి రూ. 15 వేల మధ్య స్థిరంగా కొనసాగుతోంది. బహుళ జాతీయ కంపెనీలు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండటంతో అద్దెలకు విపరీతమైన డిమాండ్ ఉంది. తద్వారా ఇక్కడ పెట్టుబడి పెట్టే వారికి అద్దెల రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తోంది. దీనివల్ల దాదాపు 8 నుండి 12 శాతం వరకు రాబడిని పొందవచ్చు.

గచ్చిబౌలికి సమీపంలోనే అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ ప్రాంతం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఐటీ కారిడార్ విస్తరణ, రాబోయే మెట్రో రెండో దశ అంచనాలతో ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ధరలు రూ. 8 వేల నుండి రూ. 11 వేల మధ్య అందుబాటులో ఉండటం వల్ల రానున్న కాలంలో భారీ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది.

Also Read

నగరానికి దక్షిణ భాగంలో ఉన్న శంషాబాద్ ప్రాంతం విమానాశ్రయం ఆధారిత అభివృద్ధికి కేంద్రంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉండటంతో పాటు ఏరోస్పేస్ పార్క్, ఫార్మా సిటీ, రీజినల్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంత భవిష్యత్తును మార్చబోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ధరలు చదరపు అడుగుకు రూ. 5 వేల నుండి రూ. 9 వేల మధ్య అందుబాటులో ఉండటం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కేవలం పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా, ఇప్పుడు నలుమూలలా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు దూరంగా ఉండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే వారి కోసం ఉత్తర మరియు తూర్పు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు కొత్త ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఉప్పల్, కొంపల్లి, అల్వాల్, మోకిల వంటి ప్రాంతాలు తమదైన శైలిలో అభివృద్ధి చెందుతున్నాయి.

తూర్పు హైదరాబాద్ విషయానికి వస్తే.. ఉప్పల్ ప్రాంతం ఐటీ విస్తరణలో భాగంగా సరికొత్త రూపును సంతరించుకుంటోంది. ప్రభుత్వం 'లుక్ ఈస్ట్' (Look East) విధానాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఇక్కడ ఐటీ పార్కులు, మెట్రో కనెక్టివిటీ రియల్ ఎస్టేట్ వృద్ధికి ఊతమిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘటకేసర్ వరకు ఉన్న వరంగల్ హైవే పరిసరాల్లో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 5,000 నుండి రూ. 7,000 మధ్యలో ఉంది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల ఉనికి, రాబోయే స్కైవాక్ వంటి మౌలిక వసతుల కారణంగా మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఇది ఒక సురక్షితమైన ఎంపికగా మారింది.

ఉత్తర హైదరాబాద్‌లో కొంపల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాలు నివాస యోగ్యమైన హబ్‌లుగా మారాయి. నాగ్‌పూర్ హైవేపై ఉన్న ఈ ప్రాంతాలు ఒకప్పుడు కేవలం ఫామ్‌హౌస్‌లకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మరియు అపార్ట్‌మెంట్‌లతో కళకళలాడుతున్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 4,500 నుండి రూ. 6,500 వరకు అందుబాటులో ఉంది. నగరం నడిబొడ్డుకు వెళ్లడానికి మంచి రవాణా సౌకర్యాలు ఉండటం మరియు కాలుష్య రహిత వాతావరణం కావాలనుకునే వారు అల్వాల్, కొంపల్లి వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రభావం ఈ ప్రాంతాలపై ఎక్కువగా ఉండటంతో దీర్ఘకాలికంగా ధరలు పెరిగే అవకాశం ఉంది.

నగరానికి మరోవైపు పశ్చిమాన శంకరపల్లి, మోకిల ప్రాంతాలు 'సెకండ్ హోమ్' లేదా విల్లా ఇన్వెస్ట్‌మెంట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. గచ్చిబౌలి, కోకాపేటలకు చేరువగా ఉంటూనే ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల ఐటీ ఉన్నతాధికారులు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 6,000 నుండి రూ. 8,500 మధ్యలో కొనసాగుతోంది. ఈ ప్రాంతాలు భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్‌కు అనుబంధంగా మారి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+