దేశంలో రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్.. అపార్ట్‌మెంట్ల ధరలు చూసి బెంబేలెత్తుతున్న మధ్య తరగతి ప్రజలు..

Hyderabad Real Estate Boom: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలోనే రెండవ అత్యంత ఖరీదైన నగరంగా తెలంగాణ రాజధాని ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు చౌకైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడిన హైదరాబాద్.. ఇప్పుడు స్థిరాస్తి ధరల పరంగా ముంబై తర్వాత దేశంలో రెండవ అత్యంత ఖరీదైన నగరంగా అవతరించింది.

ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రాప్‌టైగర్.కామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో నివాస గృహాల ధరలు సంవత్సరానికొకసారి 6 శాతం పెరిగాయి. ఇది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గృహ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్‌ను నిలబెడుతోంది.

Hyderabad Real Estate Hyderabad Property Prices Most Expensive Cities India Hyderabad Real Estate Market Property Investment Hyderabad Hyderabad Housing Boom Hyderabad Realty Trends Costliest Cities India 2025 Real Estate Price Hike Hyderabad Hyderabad vs Mumbai Property Hyderabad Real Estate News 2025 vs

గత ఏడాదిలో హైదరాబాద్‌లో గృహాల సగటు ధరలు చదరపు అడుగు రూ. 5,800 నుండి రూ.6,000కు పెరిగాయి. ఈ పెరుగుదల ముంబైలో గమనించబడిన 3 శాతం పెరుగుదల కంటే రెండు రెట్లు ఎక్కువ. ముంబైలో చదరపు అడుగు ధర రూ. 9,600 నుండి రూ. 9,800కి పెరిగింది. ఈ వేగవంతమైన పెరుగుదలతో.. హైదరాబాద్ ప్రస్తుతం ముంబై తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాలను దాటుకుని సెంకడ్ మోస్ట్ కాస్ట్ లీ నగరంగా హైదరాబాద్ అవతరించింది.

ఇక దేశంలో ధరలు పెరుగుతున్నప్పటికీ, చౌక గృహాల కోసం డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణాలుగా తక్కువ హోం లోన్ వడ్డీ రేట్లు
అనేక రాష్ట్రాలలో స్టాంప్ డ్యూటీల తగ్గింపు, ర్కిల్ రేట్ల పునఃపరిశీలన, మొదటిసారి గృహ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ కారణాల వలన మధ్య తరగతి,చౌక గృహ విభాగాల్లో కొనుగోలు చురుకుగా కొనసాగుతోంది.

సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల డెవలపర్లపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ, గృహ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు పలు రకాల ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, చెల్లింపు ప్రణాళికలను అందిస్తున్నారు. పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నట్టు.. నిర్మాణ సామాగ్రి ధరలు ఇలాగే పెరుగుతుంటే, హైదరాబాద్ వంటి నగరాల్లో అప్రార్త్మెంట్ ధరలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందడంలో నగర మౌలిక సదుపాయాల విస్తరణ, ఐటీ రంగ వృద్ధి, పెట్టుబడిదారుల ఆకర్షణ కీలక పాత్ర పోషించాయి. అయితే, వేగంగా పెరుగుతున్న గృహ ధరలు, భవిష్యత్తులో చౌక గృహాలకు అవకాశాలను తగ్గించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.క్లుప్తంగా చెప్పాలంటే హైదరాబాద్ ప్రస్తుతం పెట్టుబడిదారుల ఆస్తుల విలువను పెంచుతున్నా, మధ్య తరగతి గృహ యజమానుల కలలకను మాత్రం చిదిమేస్తుందనే విషయం అందరూ గమనించాల్సిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+