Hyderabad Real Estate at a Crossroads:హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఇన్నాళ్లు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎక్కవ ధరలు. ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

అదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో కొంత మేర అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులపై ప్రభావం హైదరాబాద్ నగరంపై కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నివాసం ఉండటానికి సొంత ఇల్లు కొనాలనుకున్నవారు అధిక ధరల కారణంగా పాత గృహాల వైపే చూస్తున్నారు.
మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ - రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్‌లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా నగరం యొక్క రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను ట్రాక్‌లో ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications