హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గత దశాబ్ద కాలంగా అద్భుతంగా రాణిస్తూ వస్తోంది. ఈ మహా నగరంలో రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా పరుగులు తీయడానికి ప్రధాన కారణం ఒకటే - ఐటీ (Information Technology). ఐటీ విస్తరణతో వెస్ట్ హైదరాబాద్ దశ మారింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కొత్త దిక్సూచిగా డేటా సెంటర్లు మారబోతున్నాయి. గచ్చిబౌలి తరహాలో మరికొన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వనున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్(Hyderabad) లో 1990లలో హైటెక్ సిటీ, మాదాపూర్ కేంద్రంగా ఐటీ విప్లవం మొదలైంది. క్రమంగా ఈ విస్తరణ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రాంగూడ, కోకాపేట, కొండాపూర్ వంటి ప్రాంతాలకు పాకింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజాలు సైతం ఇక్కడ భారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఐటీ కంపెనీల కారణంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం - ఇవన్నీ కలిసి పశ్చిమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కీలకమైన చర్చ నడుస్తోంది. వెస్ట్ హైదరాబాద్‌లాగే.. భవిష్యత్తులో గచ్చిబౌలి తరహా అభివృద్ధిని చూడబోయే ప్రాంతాలు ఏవి?
గేమ్ ఛేంజర్: అమెజాన్ డేటా సెంటర్లు
ఈ ప్రశ్నకు సమాధానంగా రియల్ ఎస్టేట్ నిపుణులు చూపుతున్న కొత్త దిక్సూచి - డేటా సెంటర్లు. ప్రస్తుతం హైదరాబాద్ డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఈ రంగంలో అంతర్జాతీయ దిగ్గజం అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మూడు కీలక ప్రాంతాల్లో డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టింది. అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీల భారీ పెట్టుబడి ఒక ప్రాంతంలోకి ప్రవేశిస్తే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనూహ్యంగా పెరుగుతుంది.
మూడు కీలక ప్రాంతాలు ఇవే..
అమెజాన్ తన డేటా సెంటర్లను దాదాపు రూ. 36 వేల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తోంది. భవిష్యత్తులో మరో రూ. 60 వేల కోట్లతో వీటిని విస్తరించాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఈ డేటా సెంటర్లు రానున్న ప్రాంతాలు ఇవే:
1. కందుకూరు మండలం, మీర్‌ఖాన్‌పేట (రంగారెడ్డి జిల్లా)
- ఇక్కడ సుమారు 48 ఎకరాల్లో AWS డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది.
- ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.
- ఇది ఫార్మాసిటీకి సైతం దగ్గరగా ఉండటం వల్ల, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ, గృహాల డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది.
2. షాబాద్ మండలం, చందనవెల్లి (రంగారెడ్డి జిల్లా)
- చందనవెల్లి కూడా డేటా సెంటర్ నిర్మాణానికి మరో ముఖ్య ప్రాంతంగా మారింది. ఇక్కడ AWS తో పాటు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- రెండు ప్రధాన టెక్ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ప్రాంతం త్వరలోనే భారీ ఐటీ/డేటా హబ్‌గా మారే అవకాశం ఉంది.
3. రావిర్యాల ప్రాంతం (ఫ్యాబ్ సిటీ సమీపంలో)
- రావిర్యాల వద్ద కూడా AWS డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది.
- ఈ ప్రాంతం ఫ్యాబ్ సిటీకి సమీపంలో ఉండటం, మౌలిక సదుపాయాల లభ్యత వల్ల రియల్ ఎస్టేట్ వృద్ధికి అనుకూలమైన వాతావరణం నెలకొంది.
పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం
ఐటీ విస్తరణ గచ్చిబౌలి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఎలా మార్చిందో అలాగే ఈ డేటా సెంటర్ల నిర్మాణం రాబోయే ఐదారు సంవత్సరాలలో పైన చెప్పబడిన మూడు ప్రాంతాల దశను మారుస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు బలంగా నమ్ముతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లో ఈ ప్రాంతాలు భవిష్యత్తులో చిన్నపాటి గచ్చిబౌలి లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా ఈ ప్రాంతాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి)
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications