రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న జాబితాలో భాగ్యనగరం యువత క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెండో స్థానానికి చేరుకుంది. ఎక్కువ రుణాలు తీసుకుంటున్న నగర యువత జాబితాలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, పుణే, ముంబై, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్ ఉన్నాయి.

వీటి కోసం ఎక్కువ రుణాలు
వైద్య ఖర్చులు, గృహోపకరణాల కొనుగోలుకు మిలీనియల్స్ ఎక్కువగా డిజిటల్ రుణాలు తీసుకుంటున్నారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎక్కువ మొత్తంలో EMIల చెల్లింపులను అధిగమించేందుకు డిజిటల్ రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు డిజిటల్ లెండింగ్ కంపెనీ క్యాష్ఈ (CASHe) వెల్లడించింది. యువత ఖర్చు చేస్తున్న అంశాలు, అభిరుచులపై ఈ సంస్థ నివేదిక వెలువరించింది. వైద్య ఖర్చులు, ఎలక్ట్రిక్ పరికరాల కొనుగోళ్లకు యువత ఎక్కువగా రుణాలు తీసుకుంటోందని తెలిపింది. వార్షిక పద్ధతిన 4,00,000 వినియోగదారులు రుణ దరఖాస్తులను CASHe అధ్యయనం చేసింది.

అలాంటప్పుడు డిజిటల్ రుణాలు
రుణాల చెల్లింపుపై తగిన రేటింగ్ హిస్టరీ లేని మిలీనియయల్స్ అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు డిజిటల్ లెండింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వైద్య ఖర్చులు ఎదురైనప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

57 శాతం వైద్యం వంటి అత్యవసరాలకే
వీరు తీసుకుంటున్న రుణాల్లో 57% వైద్య ఖర్చుల వంటి అత్యవసరాలకే వినియోగిస్తున్నారు. ఇందులో అత్యవసర వైద్య చికిత్స కోసం 37 శాతం మంది రుణాలు తీసుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరిగింది. తాము కోరుకున్న వాటిని కొనుగోలు చేసేందుకు 43 శాతం మంది రుణాలు తీసుకుంటున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో రుణ గిరాకీ పెరిగింది.

ఈ శాలరైడ్ వేతనం వైపు మొగ్గు
రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య శాలరీ ఉన్న యువత ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఆరు నెలల వ్యవధి కలిగిన రుణాల వైపు వీరు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఇలా చెల్లిస్తున్నారు..
మిల్లీనియల్స్ తమ రుణాలను చెల్లించేందుకు UPI, నెఫ్ట్ వంటి వాటిని ఎక్కువా వినియోగిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో రుణాలకు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు. CASHe యాప్‌పై రుణాలు పొందుతున్న మహిళలు 10 శాతం మాత్రమే ఉన్నారు. 31-38 ఏళ్ల మధ్య వయస్సులోని వారు తీసుకునే రుణాల వాటా 58 శాతంగా ఉంది.

2023 నాటికి 10,000 కోట్ల డాలర్లకు..
సగటున 71 రోజుల వ్యవధిలో రుణం తీసుకుంటున్నారు. 73 శాతం మంది రుణాల కోసం తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.10,000 కన్నా తక్కువ రుణం తీసుకుంటున్న వారు 27 శాతం మంది. కొత్త తరం యువత అవసరాలకు అనుగుణంగా రుణాలు సమకూర్చే బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల డిజిటల్ లెండింగ్ కంపెనీలు రంగ ప్రవేశం చేస్తున్నాయని CASHe కేతల్ పటేల్ అన్నారు. 2023 నాటికి ఈ పరిశ్రమ రూ.10,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications