Hyderabad News: వరల్డ్ క్లాస్ సిటీస్ రేస్‌లో హైదరాబాద్.. కనీసం పట్టణాలతో పోటపడలేక..
Telangana News: దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ నగరాలను వెనక్కినెడుతూ ఎప్పటికప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతూనే ఉంది. ఏ అభివృద్ధి నివేదిక చూసినా ఇండియా నుంచి హైదరాబాద్ తప్పకుండా ఉంటుందనే భరోసా గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో మరోసారి భాగ్యనగరం పోటీపడింది. అయితే దేశంలోని ఇతర పట్టణాలతో పోలిస్తే మాత్రం బాగా వెనకబడటం గమనార్హం.
ఇండిపెండెంట్ ఎకనమిక్ అడ్వైజరీ సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ఇటీవల రిలీజ్ చేసిన ర్యాంకుల్లో హైదరాబాద్‌కు స్థానం కల్పించింది. భారతదేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో భాగ్యనగరానికి చోటు లభించింది. ఎకానమీ, హ్యూమన్ క్యాపిటల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్యావరణం మరియు ప్రభుత్వ పాలన అనే 4 అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ రూపొందించినట్లు తెలుస్తోంది.

'ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024' పేరుతో ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 564వ స్థానంలో ఉంది. కాగా దేశంలో టాప్ 10 నగరాల్లో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుని కొంత నిరాశపరిచింది. పరిగణలోనికి తీసుకున్న 4 విభాగాల్లో ఎకానమీ పరంగా అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు రిపోర్ట్ తెలిపింది.
ఇక ఈ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ పరంగా దేశరాజధాని ఢిల్లీ అగ్ర నగరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 350వ స్థానం సంపాదించింది. తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, పూణే, త్రిసూర్, హైదరాబాద్, కోజికోడ్‌లు ఉన్నాయి. కోజికోడ్, త్రిసూర్ వంటి చిన్న నగరాలకు సైతం భాగ్యనగరం పోటీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యంగా కలిగిస్తోంది. కాగా ఈ జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications