Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం నగర జీవనాన్నిఅస్తవ్యస్తంగా మార్చింది. అనేక ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్‌లలో రహదారులు పూర్తిగా స్థంభించిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడం, వాహనాలు నీటిలో ఇరుక్కుపోవడం, ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది.
ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసుల సూచనలతో పాటు.. అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులను స్టాగర్డ్ వర్కింగ్ అవర్స్ పాటించాలని ఆదేశించాయి. దీని ప్రకారం.. ఉద్యోగులు ఒకేసారి కార్యాలయాలకు రాకుండా.. విడతల వారీగా సమయాన్ని మారుస్తూ పని చేయాలని పోలీసులు సూచించారు. దీని ద్వారా రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే భారీ వర్షాలకు అలర్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు.
మాధాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రోడ్లు పూర్తిగా నీటిమునిగిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఎర్రమంజిల్, మియాపూర్, చందానగర్‌లో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అత్యవసర బృందాలు నీటిని పంప్ చేసి రహదారులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే వర్షం కొనసాగుతుండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే రెండు రోజులపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా నడవాలని అధికారులు హెచ్చరించారు. నిన్న రాత్రి మేము ఇంటికి చేరుకోవడానికి మూడున్నర గంటలు పట్టింది. రహదారులన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ రోజు ఆఫీసుకు రావాలా వద్దా అనే అనుమానంలో ఉన్నామని ఒక ఐటీ ఉద్యోగి తెలిపారు.
మరోవైపు, కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) ఎంపికను ఇచ్చాయి. ప్రత్యేకంగా నీటిమునిగిన ప్రాంతాల్లో నివసించే ఉద్యోగుల కోసం ఇంటి నుండే పనిచేయాలని సూచించాయి. హైదరాబాద్‌లో వర్షం నగర రవాణా, విద్యుత్ సరఫరా, ఐటీ కారిడార్‌లోని కార్యాలయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు, కంపెనీలు కలసి తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితి కొంతవరకు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గత మూడు రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వరదలకు కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద నేషనల్ హైవే 44 కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు శుక్రవారం ఉదయం బ్లాక్ అయ్యింది. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు.. 20 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలు భారీ వరదలకు అతలాకుతలం అయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో ఏపీ,తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications