ఉద్యోగులు ఈ రెండు రోజులు ఇంటి నుంచే పని చేయండి, భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచన

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరుగా వాన కురుస్తోంది. ఇవాళ, రేపు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఐటీ కంపెనీలకు ఒక కీలక సూచన చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అలాగే ఉద్యోగుల భద్రత దృష్ట్యా, వారిని వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయడానికి అనుమతించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ సూచనను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వీలైతే ఈ మూడు రోజుల పాటు ఇంటి దగ్గర నుంచే ప్రయత్నించాలని ఉద్యోగులకు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని Hyderabad పోలీసులు తెలిపారు.అందువల్ల ఉద్యోగులను ఇంటి నుంచే పనులు చేసుకునేందుకు అనుమతిస్తే ఊరటగా ఉంటుందని సైబరాబాద్‌ పోలీసులు కోరారు. అలాగే ఉద్యోగులు సైతం కంపెనీలకు, మేనేజర్లకు వర్క్‌ఫ్రం హోం(WFH) ఇవ్వాలంటూ సందేశాలు పెడుతున్నారు. దూర ప్రయాణాలకు బదులు ఈ వెసులు బాటు కల్పించాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు రూట్లలో రోడ్లపై వరద నీరు చేరగా.. ట్రాఫిక్‌ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది.

Hyderabad rains Hyderabad heavy rain alert Hyderabad police advisory IT companies work from home Hyderabad traffic update Hyderabad weather warning Telangana rain news Hyderabad tech corridor rains work from home advisory Hyderabad Hyderabad rainfall news Hyderabad IT employees Hyderabad rain traffic

భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రానికి గట్టి వర్షాల హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం, శనివారం రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని తెలిపింది. ఈ కారణంగా రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ వంటి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

IMD తాజా బులెటిన్ ప్రకారం.. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు నిరంతరంగా కొనసాగుతాయని అంచనా వేసింది. ఈ వర్షాల సమయంలో మెరుపులు, ఈదురుగాలులు, ఉరుములు కూడా చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. గాలుల వేగం 30 నుండి 50 కి.మీ. వరకు పెరిగి బలహీన నిర్మాణాలను, చెట్లను, విద్యుత్ లైన్లను కూల్చివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే వాతావరణం సమస్యల కారణంగా విమానయాన రంగంలో అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌కు రావాల్సిన అనేక విమానాలు రద్దు అయ్యాయి లేదా దారి మళ్లించారు. ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, పూణే నుండి బయలుదేరిన ఇండిగో విమానాలు విజయవాడకు మళ్లించారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాతావరణ శాఖ భద్రతా సూచనలో నివాసితులు, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జలదిగ్బంధం పరిస్థితులు తలెత్తవచ్చని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చని అధికారులకు ముందుగానే సూచనలు పంపింది.

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు రుతుపవనాలు చురుకుగా ఉండబోతున్నాయి. దాదాపు ప్రతి రోజూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది రైతులకు పంటల పెరుగుదలలో కొంత ఉపశమనం కలిగించినా, మౌలిక వసతులు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవు.హైదరాబాద్ పోలీసుల తాజా సూచన వల్ల, ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పని చేస్తే, రోడ్లపై వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు తగ్గడమే కాకుండా, ప్రజల భద్రత కూడా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+