Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి వాన కురుస్తోంది. సాయంత్రం 5-.30 గంటలకు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వాన ఆ తర్వాత అంతటా దంచికొట్టింది.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నడుంలోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గచ్చిబౌలిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ విపరీతంగా స్థంభించిపోయింది. కొద్ది గంటల్లోనే గచ్చిబౌలిలో 12.35 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.మణికొండ, షేక్‌పేట్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఐటీ హబ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కిలోమీటర్ల పొడవున వాహనాల ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. ఐటీ ఉద్యోగులతో పాటుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కీలక జంక్షన్లలో నీటి ముంపు కారణంగా వాహనదారులు చిక్కుకుపోయారు.
సాయంత్రం పని ముగించుకొని ఇంటి బాట పట్టిన ఉద్యోగులు ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. సాధారణంగా 20-25 నిమిషాల్లో పూర్తయ్యే బంజారాహిల్స్-మణికొండ ప్రయాణం ఈసారి రెండు గంటలకుపైగా సాగింది. పలు మార్గాలు మూసుకుపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.చిత్రపురి కాలనీ, లాంకో హిల్స్ వంటి అనేక నివాస ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారులు నీటితో నిండిపోయాయి. కొన్ని కాలనీల ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి పొడవైన మార్గాలు తిరగాల్సి వచ్చింది. కొందరు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా విభాగాలు తక్షణ చర్యలకు దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దులాపూర్‌మెట్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్‌నగర్, మీర్‌పేట్‌లలో మోస్తరు నుండి భారీ వర్షం పడింది.
పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాదు వంటి కేంద్ర ప్రాంతాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఐటీ హబ్‌లలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ మరియు టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరుద్ఘాటించారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ ప్రాంతాల్లోనూ వరద ముప్పు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరవాసులు తమ ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.ఎల్లో హెచ్చరిక 15వ తేదీ వరకూ ఉంటుందని తెలిపింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications