రియల్ ఎస్టేట్ అంటే డబ్బు ఎప్పటికో వస్తుంది అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ, సరైన టైమింగ్‌తో, సరైన డెవలపర్‌తో కలిసి ఇన్వెస్ట్ చేస్తే, returns unimaginable అయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ fintech influencer శరణ్ హెగ్డే చెబుతున్నారు. ఆయన LinkedIn పోస్ట్‌లో పంచుకున్న ఒక ఉదాహరణ ప్రకారం - కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక under-construction flat లో రూ. 20 లక్షల పెట్టుబడి చేస్తే, ఈ రోజు దాని విలువ పెరిగి రూ.1 కోటి లాభం వచ్చిందని తెలిపారు.

డెవలపర్ excavation ప్రారంభించిన దశలో ప్రాజెక్ట్‌లో ప్రవేశించడం ద్వారా - అంటే ప్రారంభ ధరల దగ్గర కొనడం ద్వారా గరిష్ఠంగా లాభాలు పొందవచ్చు.దీనిక ఉదాహరణగా ఒక ప్రాజెక్ట్ లో రూ. 1.2 కోట్ల విలువైన ఫ్లాట్లు నాలుగేళ్లలో రూ. 2.2 కోట్లకు చేరుకున్నాయి. ఆ ప్లాట్ విలువ నాలుగేళ్లలో డబుల్ అయింది. Construction-linked loans ద్వారా స్టెప్పుగా డబ్బు పెట్టడం వలన, upfront capital అవసరం తక్కువగా ఉంటుందని శరణ్ హెగ్డే చెబుతున్నారు.
ఇప్పటికే రెడీ అయిన ఫ్లాట్ లో మీరు పెట్టుబడులు పెడితే appreciation cycle కి ముందు నుండే మనీ పొందుతారు. ఇందులో రెంటల్ 2-3% మాత్రమే ఉంటే మీకు తిరిగి వచ్చేది తక్కువగా ఉంటాయి. ఇక భారతదేశంలో సుమారు 30% under-construction ప్రాజెక్ట్లు ఆలస్యమవుతున్నాయి. కాబట్టి డెవలపర్ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేసి ఇస్తాడని తెలుసుకోవడం తప్పనిసరి.
శరణ్ హెగ్డే ఇటీవల హైదరాబాద్‌కి వెళ్లి, 10,000 homes నిర్మిస్తున్న ఓ డెవలపర్‌ని కలిశానని చెప్పుకొచ్చారు. వారి scale (రూ. 6,000 కోట్లకు పైగా విక్రయాలు) చూస్తే, మనం ఇప్పటికీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ మొదటి స్టేజిలోనే ఉన్నామేమో అనిపించిందన్నారు. సరైన సమయంలో సరైన ప్రాజెక్టులో, సరైన డెవలపర్‌తో కలిసి ఇన్వెస్ట్ చేస్తే.. రియల్ ఎస్టేట్ కూడా 2X, 3X returns మాత్రమే కాక, 5X returns కూడా ఇవ్వగలదని ఆయన అన్నారు.
చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే దేళ్ల పాటు వేచి ఉండాల్సిన పెట్టుబడిగా కనిపిస్తుంది. అయితే సైన టైంలో పెట్టుబడి పెడితే ఫలితాలు కూడా అంతే త్వరగా వస్తాయని హెగ్డే చెబుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో, అంటే excavation stage లో కొనుగోలు చేస్తే, గరిష్ఠ లాభాలు పొందే అవకాశముందని చెబుతున్నారు. Construction-linked loan వాడితే, ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుగుణంగా మీరు డబ్బు చెల్లించవచ్చు. దీని వలన ముందుగానే పెద్ద మొత్తాన్ని పెట్టనక్కరలేదు. అలాగే appreciation లాభాన్ని పూర్తిగా పొందవచ్చని అంటున్నారు.
More From GoodReturns

ప్రాప్‌షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్‌లో అద్దెలు ఆకాశానికి!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications