ప్రపంచ ఫార్మా పరిశ్రమ 1.2 ట్రిలియన్ డాలర్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. ఇది భారీ మార్కెట్, మరియు ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కరోనావైరస్ మెడిసిన్ మరియు టీకాలను అభివృద్ధి చేసే ఔషధ సంస్థలు ఇప్పుడు మరింత ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు 2020 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫార్మా కంపెనీల పెట్టుబడి ప్రణాళికలు
కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్ డెసివిర్, ఫావిపిరావిర్ వంటి మందులను తయారు చేయడమే కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి , తయారీ ఒప్పందాలను చేసుకున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీలు ప్రపంచ దేశాలను ఆకర్షించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .ఇక ఈ నేపద్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించాయి ఫార్మా కంపెనీలు. 2020లో మిగతా పరిశ్రమలతో పోలిస్తే భారతదేశ ఔషధ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది అని చెప్పాలి.

వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాల దూకుడు
కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి తయారీ హైదరాబాద్ ఔషధ వ్యాక్సిన్ కంపెనీలకు పెద్ద అవకాశాన్ని అందించింది భారత్ బయోటెక్ దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంతోపాటు మరో రెండు వ్యాక్సిన్ ల అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకుంది. అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యాక్సిన్ అభివృద్ధి తయారీ రేసులో ముందు నిలిచాయి . రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి క్లినికల్ పరీక్షలు , తయారీకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది . హైదరాబాద్లోని కంపెనీలకు ప్రస్తుతం ఏటా 200 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది.

భారీగా పట్టుబడులు ప్రకటించిన సంస్థలు ఇవే
హైదరాబాదులోని ఔషధ సంస్థలకు ముఖ్యంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో ఫార్మా కంపెనీలన్నీ భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించాయి. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి డాక్టర్ రెడ్డీస్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రణాళికగా ప్రకటించింది. దివీస్ లేబరేటరీస్ గతంలో వెల్లడించిన పెట్టుబడుల ప్రణాళికలకు అదనంగా మరో నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లుగా పేర్కొంది. ఇదే సమయంలో గతంలో విస్తరణకు ఏడు వందల కోట్ల రూపాయలను వెచ్చించాలని భావించిన లారస్ ల్యాబ్స్ దాన్ని ఏకంగా 1200 కోట్ల పెంచింది.

ఈ ఏడాది ఔషధ ఎగుమతులు 2500 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా
భారత్ బయోటెక్ జీనోమ్ వ్యాలీ లో కొత్తగా వ్యాక్సిన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. అరబిందో ఫార్మా కూడా భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. మొత్తానికి కోవిడ్ సంక్షోభ పరిస్థితుల సమయంలో కూడా దేశీయ ఫార్మా పరిశ్రమ పనితీరు బాగా ఉన్నందున ఔషధ ఎగుమతులు 2500 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేయడం దేశీయ ఫార్మా పరిశ్రమ దూకుడుకు అద్దం పడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications