For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో .. దేశవ్యాప్తంగా 20 వేల మందికి ఉపాధి

|

నుమాయిష్ గా ప్రసిద్ది చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వార్షిక ఎగ్జిబిషన్ (AIIE) ప్రతి ఏడాది జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమవుతుంది . అయితే ఈసారి కరోనా కారణంగా ఉంటుందా లేదా అన్న అనుమానాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. కరోనా వైరస్ విజృంభణతో ప్రజలు గుంపులుగా ఉండకూడదన్న నిబంధనల నేపథ్యంలో ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అన్నది మొన్నటి వరకు సందిగ్ధం గానే ఉంది.

నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో ప్రారంభమవుతుందన్న నిర్వాహకులు

నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో ప్రారంభమవుతుందన్న నిర్వాహకులు

ఆ సందిగ్ధానికి చెక్ పెడుతూ నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ యధావిధిగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది . ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహణ జరగదు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని సొసైటీ పేర్కొంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎగ్జిబిషన్ ను నడుపుతామని సొసైటీ వెల్లడించింది. సంబంధిత విభాగాలతో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ఎగ్జిబిషన్ ఏ రోజు ప్రారంభం అవుతుందో తేదీ ప్రకటిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ పేర్కొంది.

ఎగ్జిబిషన్ లో వ్యాపారులు స్టాల్స్ నిర్వహించడానికి ఆసక్తితో ఉన్నారన్న కమిటీ

ఎగ్జిబిషన్ లో వ్యాపారులు స్టాల్స్ నిర్వహించడానికి ఆసక్తితో ఉన్నారన్న కమిటీ

ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సభ్యులు ఆదిత్య మార్గం మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ సొసైటీ మరియు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మద్దతు ఉన్న 20 విద్య మరియు స్వచ్ఛంద సంస్థలకు నుమాయిష్ మూలం అని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో వ్యాపారులు ఎప్పటిలాగే స్టాల్స్ నిర్వహించడానికి ఆసక్తి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈసారి నుమాయిష్ ఎలా నిర్వహించవచ్చనే దానిపై ప్రజారోగ్యం మరియు ప్రభుత్వ సంస్థల నుండి మార్గదర్శకాలను తీసుకొని నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ హామీ ఇచ్చింది.

కరోనా కారణంగా తేదీ మార్పు .. అధికారులతో సంప్రదించి షెడ్యూల్ వెల్లడిస్తామన్న కమిటీ

కరోనా కారణంగా తేదీ మార్పు .. అధికారులతో సంప్రదించి షెడ్యూల్ వెల్లడిస్తామన్న కమిటీ

79 సంవత్సరాలలో మొదటిసారిగా, 46 రోజుల పాటు నిర్వహించే నుమాయిష్ ప్రారంభ తేదీని జనవరి 01 నుండి తరువాతి తేదీకి వాయిదా వేయనుంది. తాము అధికారుల నుండి అనుమతి పొందిన తరువాత, 81 వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం తేదీ మరియు షెడ్యూల్ ప్రకటించగలము అని పేర్కొన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే ఎగ్జిబిషన్ సొసైటీకి నుమాయిష్ ప్రధాన ఆదాయాన్ని అందిస్తోంది.

15,00 స్టాల్స్ తో అతి పెద్ద ఎగ్జిబిషన్ .. 20 వేల మందికి ఉపాధి

15,00 స్టాల్స్ తో అతి పెద్ద ఎగ్జిబిషన్ .. 20 వేల మందికి ఉపాధి

ఇది దేశవ్యాప్తంగా 20 వేల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష జీవనోపాధిని అందిస్తుంది.అంతేకాకుండా, దాదాపు రెండు నెలల పాటు ఎగ్జిబిషన్ మీద ఆధారపడిన వడ్రంగి, చిత్రకారులు, ఎలక్ట్రీషియన్లు మరియు కార్మికులు వంటి వేలాది మంది తాత్కాలిక కార్మికులకు నుమాయిష్ ఉపాధి కల్పిస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం కూడా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరు. దాదాపు 20 లక్షల టికెట్లు, 15,00 స్టాల్స్ , స్టాల్ అద్దెలు , అందులో సాగే వ్యాపారం, దుకాణదారుల అమ్మకాల టర్నోవర్ ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయ వనరు సమకూరుతుంది.

English summary

హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో .. దేశవ్యాప్తంగా 20 వేల మందికి ఉపాధి | Hyderabad Numaish Exhibition commence soon .. Employment for 20k people across the country

Annual All India Industrial Exhibition (AIIE), popularly known as Numaish, will commence soon announced organizers.It also provides direct and indirect livelihood to around 20,000 people from across the nation .
Story first published: Thursday, December 17, 2020, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X