హైదరాబాద్ అంటేనే బిర్యానీ, చాయ్, సందడి. అయితే అదంతా కేవలం పగటిపూట మాత్రమే. రాత్రి అయితే సిటీ అంతా స్తబ్ధుగా మారిపోతుంది. ఎక్కడైనా షాపులు తెరవాలన్నా.. అర్ధరాత్రి దాటితే చాలు పోలీసులు వస్తారనే భయం, షట్టర్లు వేయాలనే కంగారు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారబోతోంది. మన హైదరాబాద్(Hyderabad) నగరం ఒక అంతర్జాతీయ స్థాయి 24/7 మెట్రోగా మారేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'నైట్ టైమ్ ఎకానమీ' (NTE) పాలసీ ద్వారా ఇకపై రాత్రంతా వ్యాపారాలు యధేచ్ఛగా సాగనున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీకోసం..

లైసెన్స్ రాజ్ ముగిసింది.. ఇక జోన్ల హవా!
గతంలో 24 గంటలు షాపులు తెరిచి ఉంచాలంటే వందల కొద్దీ పర్మిషన్లు, ఎన్ఓసీలు తీసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త విధానం ప్రకారం 'పర్మిట్ రాజ్' కు స్వస్తి పలకనున్నారు. ఇది 'జోన్-బేస్డ్' మోడల్. అంటే ఒక ఏరియాను నైట్ ఎకానమీ జోన్‌గా ప్రకటించారంటే.. అక్కడ ఉండే ఏ వ్యాపారమైనా ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా రాత్రంతా నడుపుకోవచ్చు.
మొదట ఎక్కడ ప్రారంభం కానుంది?
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం.. జనవరి నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని కీలక ప్రాంతాల్లో ఇది మొదలవుతుంది..
- ఐటి కారిడార్: హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.
- సిటీ సెంటర్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్.
- హెరిటేజ్ సైట్స్: చార్మినార్ పరిసరాలు.
- ఇతర ప్రాంతాలు: సికింద్రాబాద్, ట్యాంక్ బండ్.
రూ. 26,000 కోట్ల ఆదాయం.. లక్షలాది ఉద్యోగాలు!
ఈ నైట్ ఎకానమీ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. మన హైదరాబాద్ (Hyderabad).. 2032 నాటికి ఈ విధానం ద్వారా రూ. 26,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా సుమారు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. ఫుడ్ డెలివరీ బాయ్స్ నుంచి రెస్టారెంట్ ఓనర్స్ వరకు అందరికీ ఇది లాభదాయకంగా మారనుంది.
సేఫ్టీ, ట్రాన్స్‌పోర్ట్ పై ప్రత్యేక దృష్టి
రాత్రంతా నగరం మేల్కొని ఉండాలంటే భద్రత చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. రాత్రిపూట ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు, సిటీ బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పెట్రోలింగ్ టీమ్స్, స్మార్ట్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట చెత్తను క్లీన్ చేయడానికి ప్రత్యేక స్క్వాడ్‌లు పని చేస్తాయి.
మొత్తంగా హైదరాబాద్ ఇకపై రాత్రిపూట కూడా వెలిగిపోబోతోంది. పారిస్ లాంటి నగరాల్లో ఈఫిల్ టవర్ ను రాత్రిపూట చూడటానికి పర్యాటకులు ఎలా ఆరాటపడతారో మన హైదరాబాద్ లోని చార్మినార్ లేదా దుర్గం చెరువు బ్రిడ్జిని కూడా అలాగే ఎంజాయ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న మాట. జనవరి నుంచి హైదరాబాద్ నిద్రపోని నగరంలా మారబోతోంది. మరి మీరు కూడా అర్ధరాత్రి చాయ్ తాగడానికి రెడీగా ఉన్నారా?
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications