సినిమా లవర్స్‌కు పండగే! హైదరాబాద్‌లో కొత్తరకం మల్టీప్లెక్స్‌లు! ఫీచర్స్ వింటే ఫిదా అవుతారు!
హైదరాబాద్ అంటేనే సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రేక్షకులకు సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ఎమోషన్. అందుకే నగర విస్తరణతో పాటు ఇక్కడి థియేటర్ల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు నగరంలో సాధారణ స్క్రీన్ల కాలం చెల్లిపోతోంది. వాటి స్థానంలో డాల్బీ సినిమా (Dolby Cinema), సూపర్ ప్లెక్స్ (Superplex), ఎపిక్ (EPIQ) వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన మల్టీప్లెక్స్ లు వెలుస్తున్నాయి. వీటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోకాపేటలో తొలి డాల్బీ సినిమా (Dolby Cinema)
హైదరాబాద్ ఫిల్మ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి 'డాల్బీ సినిమా' (Dolby Cinema) ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు కోకాపేటలో అందుబాటులోకి రానుంది. అల్లు అరవింద్ గారి అల్లు సినిమాస్ (Allu Cinemas) అతి త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది. ఇది ఏకంగా 75 అడుగుల వెడల్పు గల స్క్రీన్‌తో, డాల్బీ విజన్, అట్మోస్ సౌండ్‌తో ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లనుంది.
హీరోల హవా.. ఏషియన్ సినిమాస్ విస్తరణ
హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ రంగంలో ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) దూసుకుపోతోంది. ఇప్పటికే మహేష్ బాబుతో ఏఎంబీ (AMB Cinemas), అల్లు అర్జున్ తో ఏఏఏ (AAA Cinemas) వంటి ఐకానిక్ ప్రాజెక్టుల తర్వాత ఇటీవల వనస్థలిపురంలో రవితేజ భాగస్వామ్యంతో ఏఆర్టీ (ART Cinemas) ను ప్రారంభించారు. ఇక 2026 జూన్ నాటికి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ (RTC X Roads) వంటి మాస్ ఏరియాలో ఏఎంబీ క్లాసిక్ (AMB Classic) పేరుతో సరికొత్త మల్టీప్లెక్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
PVR INOX: మల్టీప్లెక్స్ కాదు.. ఇది సూపర్‌ప్లెక్స్!
నగరంలోని ప్రముఖ మాల్స్ లో ఒకటైన ఇనార్బిట్ మాల్ లో PVR INOX తన పాత 6 స్క్రీన్ల థియేటర్‌ను 11 స్క్రీన్ల భారీ 'సూపర్‌ప్లెక్స్'గా మార్చేసింది.
- ప్రత్యేకత: ఇక్కడ 55 అడుగుల వెడల్పున్న PXL (Premium Extra Large) స్క్రీన్ తో పాటు, గాలి, పొగమంచు, సువాసన వంటి ఎఫెక్ట్స్ ఇచ్చే 4DX స్క్రీన్లు కూడా ఉన్నాయి.
- కొత్త లొకేషన్లు: త్వరలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్, బండ్లగూడ , ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని ఓడియన్ మాల్ లో కూడా కొత్త పివిఆర్ ప్రాపర్టీలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ లో ఉన్న విభిన్న ఫార్మాట్లు..
ప్రేక్షకులు తమ బడ్జెట్ , ఇష్టాన్ని బట్టి ఈ కింద పేర్కొన్న ఫార్మాట్లలో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు..
- PCX (Prasads): ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఉన్న 101.6 అడుగుల భారీ స్క్రీన్.
- EPIQ: వనస్థలిపురంలోని ART సినిమాస్ లో అందుబాటులో ఉన్న ప్రీమియం లార్జ్ ఫార్మాట్.
- Luxe: పివిఆర్ లో లభించే లగ్జరీ సీటింగ్ అలాగే ప్రత్యేక మెనూ సదుపాయం.
మొత్తంగా చూస్తే.. ఓటీటీలు (OTT) ఎన్ని వచ్చినా థియేటర్లకు ఇంకా క్రేజ్ తగ్గలేదని అర్థమవుతోంది. థియేటర్లో సినిమా చూసే మజానే వేరని హైదరాబాద్ (Hyderabad) ప్రేక్షకులు మరోసారి నిరూపిస్తున్నారు. అందుకే నిర్మాతలు, థియేటర్ యజమానులు కేవలం స్క్రీన్ మాత్రమే కాకుండా, ఫుడ్, సేఫ్టీ, టెక్నాలజీ పరంగా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేందుకు పోటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications