హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్! ఈ 3 ఏరియాల్లో కొత్త MMTS స్టేషన్లు.. ఇక ప్రయాణం ఫుల్ ఈజీ!
హైదరాబాద్ సిటీలో లోకల్ ట్రైన్ ప్రయాణం అంటే సామాన్యులకు ఒక వరం. అయితే, కొన్ని ఏరియాల్లో స్టేషన్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసింది. భాగ్యనగరంలో సబర్బన్ రైలు కనెక్టివిటీని పెంచడానికి అల్వాల్, ఆనంద్‌బాగ్ , మౌలాలీలలో మూడు కొత్త హైదరాబాద్ (Hyderabad) MMTS స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఎక్కడెక్కడ కొత్త స్టేషన్లు?
చాలా కాలంగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ప్లాన్ చేశారు. ముఖ్యంగా అల్వాల్‌లోని లోయోలా కాలేజ్ సమీపంలో ఒక స్టేషన్, ఆనంద్‌బాగ్ వద్ద మరొకటి, , మౌలాలీ రైల్వే క్వార్టర్స్ వద్ద మూడవ స్టేషన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.

సాధారణంగా సబర్బన్ రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి 2 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండాలి. కానీ, ప్రస్తుతం చెర్లపల్లి , నేరెడ్‌మెట్ స్టేషన్ల మధ్య చాలా దూరం ఉంది. దీనివల్ల మల్కాజ్‌గిరి చుట్టుపక్కల ప్రజలు ట్రైన్ ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్ వస్తే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మౌలాలీ దగ్గర స్టేషన్ వస్తే అక్కడ ఉండే సుమారు 2 వేల మంది నివాసితులకు పెద్ద ఊరట లభిస్తుంది.
'రైల్ నిలయం' స్టేషన్ డిమాండ్
మరోవైపు, సికింద్రాబాద్ ఏరియాలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలుగుడ్డ బావి వద్ద 'రైల్ నిలయం' పేరుతో కొత్త స్టేషన్ ఏర్పాటు చేయాలని ట్రైన్ ట్రావెలర్స్ అసోసియేషన్ కోరుతోంది. కాజీపేట, నల్గొండ వైపు నుంచి వచ్చే రైళ్లు కొన్ని రూట్ డైవర్షన్ల వల్ల ప్రయాణికులు సమయం, డబ్బు వృధా చేసుకుంటున్నారు. ఇక్కడ స్టేషన్ వస్తే ఆ ఇబ్బందులు కూడా తప్పుతాయి.
యాదాద్రికి మోగనున్న MMTS సైరన్!
ఈ వార్తతో పాటు మరో అదిరిపోయే అప్‌డేట్ ఏంటంటే.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి MMTC కనెక్టివిటీ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. సికింద్రాబాద్ నుంచి రాయగిరి వరకు సుమారు 33 కిలోమీటర్ల మేర ఈ లైన్ విస్తరించనున్నారు. దీనికోసం దాదాపు రూ. 430 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి, రాబోయే రోజుల్లో హైదరాబాద్ (Hyderabad) లోకల్ ట్రైన్ నెట్‌వర్క్ మరింత బలోపేతం కానుంది. ఈ కొత్త స్టేషన్లు అందుబాటులోకి వస్తే సామాన్య ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు ఈ సబర్బన్ రైల్వే వ్యవస్థ ఒక వెన్నెముక లాంటిది. నగరం నలుమూలలకూ విస్తరిస్తున్న తరుణంలో, రోడ్లపై పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించాలంటే ఇలాంటి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం.


Click it and Unblock the Notifications