మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెగా మెట్రో సిటీ కూడా. సిటీ ఎంత వేగంగా పెరుగుతుందో, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా సిటీలో పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అయితే, ఆశ్చర్యకరంగా హైదరాబాద్ పొల్యూషన్ తగ్గుతుందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంలో హైదరాబాద్ (Hyderabad) మెట్రో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) విడుదల చేసిన "భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి - మెట్రో రైల్ నెట్‌వర్క్ స్పెషల్ రిఫరెన్స్" అనే నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలోనే ఐదో అతిపెద్ద నెట్‌వర్క్ గా మన మెట్రో!
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) మెట్రో ఏకంగా 69 కిలోమీటర్ల మేర విస్తరించి, దేశంలోనే ఐదో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ గా అవతరించింది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ, రోడ్లపై వాహనాల రద్దీని గణనీయంగా తగ్గిస్తోంది. కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, ఈ విస్తరణ వెనుక ఒక పెద్ద పర్యావరణ లక్ష్యం కూడా దాగి ఉంది.
గాలిలో కాలుష్యం ఎలా తగ్గుతోంది?
మెట్రో రాకముందు వేలాది మంది ప్రజలు తమ సొంత వాహనాలైన బైకులు, కార్లపై ప్రయాణించేవారు. దీనివల్ల ఇంధన వినియోగం పెరగడమే కాకుండా, విపరీతమైన పొగ (కార్బన్ ఎమిషన్స్) విడుదలయ్యేది. కానీ, మెట్రో అందుబాటులోకి వచ్చాక, ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గింది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ మెట్రో ప్రారంభమైన కొత్తలో రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు 34% తగ్గాయట. అదే మేజిక్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా పునరావృతమవుతోంది. రోడ్లపై బస్సులు, కార్ల సంఖ్య తగ్గడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం నగరవాసులకు కలుగుతోంది.
ప్రపంచ స్థాయి పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
వరల్డ్ బ్యాంక్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నగరాలే 70 శాతానికి పైగా కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తున్నాయి. ఈ సమస్యకు మెట్రో రైలు ఒక అద్భుతమైన పరిష్కారం. తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే ప్రజా రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం వల్ల నగరాల్లో కాలుష్యాన్ని 50% వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు తైపీ వంటి నగరాల్లో మెట్రో రాకతో వాహనాల వాడకం తగ్గి, గాలిలో విషపూరిత వాయువుల ప్రభావం 15% వరకు పడిపోయింది.
పర్యావరణానికి వరం.. భవిష్యత్తుకు భరోసా!
సిటీ సెంటర్లలో మెట్రో ఉండటం వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్ (ధూళి కణాలు) కూడా 4% వరకు తగ్గుతాయని అంచనా. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రపంచంలోని 192 మెట్రో నగరాల్లో అధ్యయనం చేయగా, కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరించడం ద్వారా నగరం మరింత పచ్చదనంతో, స్వచ్ఛమైన గాలితో కళకళలాడుతుందని ఆర్థికవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు. కాబట్టి మనం కూడా మెట్రో ప్రయాణాన్ని ప్రోత్సహిద్దాం.. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం!
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications