Hyderabad Metro: 8 ఏళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో! త్వరలో రాబోతున్న రూట్లు ఇవే..

నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు.. శుక్రవారం నాటికి విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని, ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2017 నవంబర్ 29న ప్రారంభమైనప్పటి నుండి ఇది సురక్షితమైన, వేగవంతమైన రవాణా సాధనంగా నిరూపించుకుంది. ఈ సందర్భంగా మెట్రో గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

hyderabad metro 8 years anniversary phase2 dpr airport shamirpet medchal expansion

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు మొదటి దశ (Phase One) విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెడ్ లైన్ (ఎల్బీ నగర్-మియాపూర్), బ్లూ లైన్ (నాగోల్-రాయదుర్గం), గ్రీన్ లైన్ (జేబీఎస్-ఎంజీబీఎస్) వంటి మూడు కారిడార్ల నెట్‌వర్క్ ప్రస్తుతం అత్యంత రద్దీగా లక్షలాది మంచి ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 57 మెట్రో స్టేషన్ల ద్వారా ప్రతిరోజూ 4.60 లక్షల నుండి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నిరంతరాయంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్న ఈ రైళ్లు, అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తున్నాయి.

రూట్స్ ఇవే..

నగరంలో ట్రాఫిక్ రహితమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో 2012లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. మొదటి కారిడార్ లో భాగంగా ఎల్‌బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం (బ్లూ లైన్, రెడ్ లైన్) మరియు జేబీఎస్-ఫలక్‌నుమా (గ్రీన్ లైన్) కారిడార్లలో 72 కి.మీ. నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఉద్యోగులే ఎక్కువ

రోజువారీ ప్రయాణికుల్లో 51.5 శాతం మంది ఉద్యోగులే ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలలో తేలింది. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి 30.3 శాతం మంది, విద్యార్థులు 6.1 శాతం మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ప్రధాన కారిడార్లలో రద్దీ తారాస్థాయికి చేరుతోంది. ప్రయాణంలో వేగం, టైమింగ్ ఉన్నా.. పెరిగిన డిమాండ్ కారణంగా బోగీల్లో కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంటుంది.
2017 నవంబర్ 29 నుండి ఈ ఏడాది నవంబర్ 26 వరకు సుమారు 80.21 కోట్ల మంది ప్రయాణం చేసినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్యే Hyderabad Metro సేవలకు ఉన్న ప్రజాదరణను స్పష్టం చేస్తుంది.

రెండో దశ విస్తరణ

పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం మెట్రో రైలు రవాణాను మరింతగా విస్తరించడానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా మొత్తం 163 కిలోమీటర్ల మేర 8 కారిడార్లను (పార్ట్-Aలో 5, పార్ట్-Bలో 3) రూ.43,848 కోట్ల వ్యయంతో ప్రతిపాదించారు.

రాబోయే రూట్స్ ఇవే..

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండవ దశలోని ముఖ్యమైన కొత్త మార్గాలకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు ఇవే..

  1. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ - ఫ్యూచర్ సిటీ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండనుంది.
  2. జేబీఎస్ - శామీర్‌పేట: జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, తూంకుంట మీదుగా శామీర్‌పేట వరకు 22 కి.మీ. లైన్ ఉంటుంది. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ రన్‌వే కారణంగా, ఇక్కడ దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు మెట్రో లైన్ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లేలా డీపీఆర్‌లో డిజైన్ చేశారు.
  3. జేబీఎస్ - మేడ్చల్: జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, కొంపల్లి మీదుగా మేడ్చల్‌కు 24.5 కి.మీ. లైన్ ప్రతిపాదించారు.

డీపీఆర్‌లు సిద్ధం

ప్రస్తుతం ఈ డీపీఆర్‌లు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చిలోగా వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (HAML) అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ అందుబాటులోకి వస్తే, Hyderabad Metro నెట్‌వర్క్ మరింతగా విస్తరించి, రద్దీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు మహానగరానికి మరింత కీర్తి లభించనుంది.

సమస్యలు కూడా..

ఇకపోతే మెట్రో విజయవంతంగా నడుస్తున్నా కొన్ని సమస్యలూ లేకపోలేదు. ముఖ్యంగా రద్దీ ప్రధాన సమస్యగా ఉంటే మౌలిక సదుపాయాలు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. చివరి మైలు కనెక్టివిటీ (Last Mile Connectivity) వసతులు దారుణంగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. స్టేషన్ల కింద ఉన్న ఫుట్‌పాత్‌లు సరిగ్గా లేకపోవడం. అలాగే పరిశుభ్రత లోపం, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలు చాలామందికి ఇబ్బందిగా మారాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+