Bengaluru: హైదరాబాద్ vs బెంగళూరు.. కాస్ట్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ లైఫ్.. ఏ సిటీలో బెటర్?

ఉద్యోగం మారేటప్పుడు ఎక్కువ ప్యాకేజీ (CTC) ఎక్కడ వస్తే అక్కడికి వెళ్లడం ఈ రోజుల్లో కామన్. ఒక కంపెనీ కంటే మరో కంపెనీ లక్షల్లో ఎక్కువ ఆఫర్ ఇస్తే చాలు.. వెంటనే బ్యాగులు సర్దేసుకుంటారు. కానీ, హైదరాబాద్‌కు చెందిన మధన్ మోహన్ అనే వ్యక్తి మాత్రం అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ నిర్ణయం తీసుకున్నాడు. తన చేతిలో బెంగళూరు (Bengaluru) లో రూ. 38 లక్షల ప్యాకేజీ (LPA) ఇచ్చే జాబ్ ఆఫర్ ఒకటూ, హైదరాబాద్‌లో రూ. 30 లక్షల ప్యాకేజీ ఇచ్చే జాబ్ ఆఫర్ మరొకటి ఉన్నాయి. ఎవరైనా సరే కళ్ళు మూసుకుని ఎనిమిది లక్షలు ఎక్కువ వస్తున్న బెంగళూరు ఆఫర్‌నే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ, మధన్ మాత్రం రూ. 8 లక్షల తక్కువ ప్యాకేజీ ఉన్న హైదరాబాద్ ఉద్యోగానికే ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Hyderabad Man Rejects Bengaluru 38 LPA Job Offer For 30 LPA For Quality Of Life

ఎందుకీ నిర్ణయం? ఎక్స్ (X) లో వివరించిన మధన్

ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని మధన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

"రూ. 8 లక్షల ఎక్కువ జీతాన్ని ఎందుకు వదులుకుంటున్నావ్?" అని నా చుట్టూ ఉన్నవాళ్లు అడిగారు. కానీ, కొన్నిసార్లు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే ఆఫరే బెస్ట్ డిసిషన్ కాదని నేను రియలైజ్ అయ్యాను" అని మధన్ రాసుకొచ్చాడు.

గత 15 ఏళ్లుగా తను హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు, ఇక్కడి వాతావరణం, మంచి ఫుడ్, తక్కువ జీవన వ్యయం (Cost of Living), తక్కువ మానసిక ఒత్తిడి, ఫ్యామిలీ , ఫ్రెండ్స్ పక్కనే ఉండటం వల్ల హైదరాబాద్ తన సొంత ఇల్లులా అనిపిస్తుందని చెప్పాడు. "ఎక్కువ జీతం పేపర్ మీద చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. కానీ ప్రశాంతత, మంచి లైఫ్‌స్టైల్, సంతోషం అనేవాటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. లాంగ్ రన్‌లో అవే చాలా ముఖ్యం. చాలా మంది కేవలం సీటీసీ (CTC) మాత్రమే లెక్కేస్తారు.. కానీ చాలా తక్కువ మంది మాత్రమే క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను లెక్కిస్తారు" అంటూ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

నెట్టింట 'హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు' వార్

మధన్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 82 వేలకు పైగా వ్యూస్ సాధించిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మధన్ నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. బెంగళూరు (Bengaluru) తో పోలిస్తే హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ బ్రో", "హైదరాబాద్ ఇస్ ద బెస్ట్" అంటూ కామెంట్లు పెట్టారు. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. "నేనైతే మొదట ఎక్కువ ప్యాకేజీ ఉన్న బెంగళూరు ఉద్యోగాన్నే ఎంచుకుంటాను. అక్కడ ఒక ఏడాది పని చేసాక, ఆ 38 లక్షల ప్యాకేజీపై మరో 30% హైక్ తీసుకుని రూ. 50 లక్షల శాలరీతో మళ్లీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాను" అంటూ కొందరు ఐటీ ఉద్యోగులు ప్రాక్టికల్ ఐడియాలను షేర్ చేశారు.

ఏదేమైనా, కెరీర్ సక్సెస్ అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడమే కాదు.. జీవితం సంతోషంగా ఉండేలా ఒక మంచి లైఫ్ బిల్డ్ చేసుకోవడమే అని మధన్ నిరూపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+