భారతదేశంలో టెక్నాలజీ, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్ వంటి అనేక రంగాల్లో ప్రపంచస్థాయి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపనకు హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా.. GCCలను ఆకర్షించడంలో హైదరాబాద్.. బెంగళూరు(Bengaluru)ను అధిగమించడం చర్చనీయాంశంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, మెక్‌డొనాల్డ్స్, కాస్ట్‌కో తాజాగా ఫ్రెంచ్ బ్యూటీ మేజర్ లోరియల్ (LOreal) వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ GCCలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనం. అసలు హైదరాబాద్ హవా కొనసాగడానికి కారణాలేంటి? ఒకప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేరాఫ్ గా ఉన్న బెంగళూరు వెనుకపడడానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ ప్లస్ పాయింట్స్ ఇవే..
ఒక సంస్థ GCCని స్థాపించేటప్పుడు కేవలం ఉద్యోగుల లభ్యతనే కాకుండా.. ఆపరేటింగ్ ఖర్చులు, రియల్ ఎస్టేట్ ధరలు, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.
- ఖర్చులో ఆదా: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహణ, రియల్ ఎస్టేట్ ఖర్చులు సుమారు 15% తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆఫీస్ అద్దెలు చదరపు అడుగుకు ఒక డాలర్ (సుమారు రూ.90) కంటే తక్కువగా ఉండటం కంపెనీలను బాగా ఆకర్షిస్తోంది.
- ప్రపంచస్థాయి వసతి: హైదరాబాద్ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన డిజిటల్ కనెక్టివిటీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్స్ (హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) GCCల స్థాపనకు అనుకూలంగా ఉన్నాయి.
హ్యూమన్ రిసోర్సెస్..
ఏదైనా టెక్ హబ్‌కు అత్యంత కీలకం నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. హైదరాబాద్ నగరంలో బీఎఫ్‌ఎస్‌ఐ (BFSI), టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి వివిధ రంగాలలో లోతైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి.
- టాలెంట్ పూల్: హైదరాబాద్ ఒక విద్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండటం, వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చే జనాభా అధికంగా ఉండటం వల్ల GCCలకు అవసరమైన టాలెంట్ పూల్ స్థిరంగా లభిస్తోంది.
- విస్తృత రంగాలు: ఈ నగరంలో కేవలం ఐటీ మాత్రమే కాకుండా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ వంటి బహుళ రంగాలకు చెందిన GCCలు తమ కార్యకలాపాలను విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీలక విధానాలు, GCCల స్థాపన, విస్తరణకు మద్దతు ఇవ్వడం కూడా ఒక కారణం అని చెప్పొ్చ్చు. సంస్థలు ఔట్‌సోర్సింగ్ నుండి ఇన్నోవేషన్, రీసెర్చ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అధిక విలువ కలిగిన కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ప్రోత్సహిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. గత మూడేళ్లలో భారతదేశంలో కొత్తగా స్థాపించబడిన గ్రీన్‌ఫీల్డ్ GCCలలో దాదాపు 40% హైదరాబాద్‌లోనే ఉండటం ప్రభుత్వ విధానాల విజయాన్ని సూచిస్తోంది.
హైదరాబాద్‌లో కొత్తగా వచ్చిన GCCలు
ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియల్ (L'Oréal) తన అతిపెద్ద గ్లోబల్ టెక్నాలజీ సెంటర్లలో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. రిటైల్ దిగ్గజం కాస్ట్‌కో (Costco) తన మొదటి GCCని నగరంలో ప్రారంభిస్తోంది. ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, నెట్‌ఫ్లిక్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఈ నిరంతర వృద్ధి హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మరింత బలోపేతం చేస్తోంది.
బెంగళూరు ఎందుకు వెనకుంది?
ఒకప్పుడు GCCలకు బెంగళూరు కేంద్రంగా ఉండేది. అయితే అక్కడి మౌలిక వసతుల ఇబ్బందుల కారణంగా కంపెనీలు ఇప్పుడు కొత్త హబ్ ను కోరుకుంటున్నాయి. బెంగళూరు ఇప్పటికే కొన్ని రంగాలలో ప్రపంచస్థాయి సంస్థలకు కేంద్రంగా ఉంది. అయితే కంపెనీ కార్యకలాపాల విస్తరణకు బెంగళూరు అనుకూలంగా లేదు. అందుకే సహజంగా హైదరాబాద్ ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో GCC మార్కెట్ మరింతగా విస్తరించడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషించనుంది.
More From GoodReturns

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..



Click it and Unblock the Notifications