మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లి ఉంటే మీకు కరాచీ బేకరీ తెలిసే ఉంటుంది. కరాచీ బేకరీలో ఫుడ్ చాల ఫెమస్ అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ ఉద్రిక్తత మధ్య తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఒక బేకరీకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ బేకరీ పేరు కరాచీ బేకరీ. కరాచీ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని ఒక నగరం. అయితే స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత అంటే 1953 లో ఖాన్‌చంద్ రామ్నాని కరాచీ పేరుతో బేకరిని స్థాపించాడు. అతను సింధీ హిందువు, విభజన తర్వాత హైదరాబాద్‌కు శరణార్థిగా వచ్చాడు.

జరిగిన సంఘటన ఏంటంటే : భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాజాగా కరాచీ బేకరీ హైదరాబాద్ బ్రాంచ్ ముందు నిరసనలు జరుగుతున్నట్లు వార్తలు ఉన్నాయి. కొంతమంది దీనిని పాకిస్తానీ బ్రాండ్ అని అంటుండగా, మరికొందరు దాని పేరు మార్చలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని తరువాత కరాచీ బేకరీ యజమానులు రాజేష్ రామ్నాని ఇంకా హరీష్ రామ్నాని ముందుకు వచ్చి అసలు విషయాన్నీ వెల్లడించారు. కరాచీ బేకరీ 100% పూర్తిగా భారతీయ బ్రాండ్ అని తెలిపారు. ఖాన్‌చంద్ రామ్నాని తాత 73 సంవత్సరాల క్రితం దీనిని స్థాపించినట్లు చెప్పారు.
కరాచీ నుండి వచ్చాడు, అందుకే బేకరీకి ఆ పేరు: PTI షేర్ చేసిన ఒక వీడియోలో బేకరీ ఓనర్ దీని పై వివరణ ఇస్తు "కరాచీ బేకరీని 1953లో హైదరాబాద్‌లో ఖాన్‌చంద్ రామ్నాని స్థాపించారు. ఆయన దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చారు.ఇప్పటికి 73 సంవత్సరాలు అయింది. మా తాతగారు దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చారు కాబట్టి దానికి కరాచీ అని పేరు పెట్టారు" అని అన్నారు.
సహాయం కోసం విన్నపం: దీని పై స్పందిస్తూ అతను సహాయం కోసం ఉన్నత అధికారులను అలాగే రాష్ట్ర సియంకి విజ్ఞప్తి చేశాడు. కరాచీ బేకరీ పేరు మార్పు పై వస్తున్న నిరసనలు ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉన్నతాధికారులను మేము కోరుతున్నాము అని అన్నారు. అయితే ఈ తరుణంలో నగరంలోని కరాచీ బేకరీ అవుట్‌లెట్లకి ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మేము భారతీయ బ్రాండ్, పాకిస్తానీ బ్రాండ్ కాదు కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వండి" అని యజమానులు అంటున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆగ్రహంగా ప్రజలు : గత కొద్దిరోజుల క్రితం భారతదేశం పాకిస్తాన్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారతదేశం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. ఈ ప్రదేశాలు పాకిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఉన్నాయి. దీని తరువాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ చేసింది. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలపై కూడా పాకిస్తాన్ నుండి దాడులు జరిగాయని నివేదికలు వచ్చాయి. దింతో ప్రతి నగరంలోని ప్రజలు పాకిస్తాన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications