Surveillance: 'మీరు నిఘా పరిధిలో ఉన్నారు' అనే రాతలను మనం చాలాచోట్ల చూస్తూ ఉంటాం. అంటే CC కెమెరాలు మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నాయని అర్థం. నేరాల కట్టడి కోసం నగరాల్లో పలు చోట్ల ఇవి ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఇలా నిఘా నీడన ఉన్న సిటీల్లో హైదరాబాద్ ప్రపంచ ర్యాంక్ సొంతం చేసుకుంది.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా పర్యవేక్షించబడే టాప్ 50 నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ప్రతి చదరపు మైలుకు సగటున 321 కెమెరాలతో, భాగ్యనగరం 41 వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు తన అధికారిక X(గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఆ సంస్థ వివరాలను షేర్ చేసింది.

ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 22వ స్థానం సొంతం చేసుకుంది. ఇక్కడ ప్రతి చదరపు మైలుకు సగటున 1,490 కెమెరాలు ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకునే అగ్ర రాజ్యంలోని ప్రముఖ నగరాలు న్యూయార్క్ 44, లాస్ ఏంజెల్స్ 58వ స్థానాల్లో నిలవడం విశేషం.
అత్యంత విస్తృతంగా పర్యవేక్షించబడుతున్న నగరాల్లో చైనాలోని షెన్ జెన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ సిటీలో సగటున 7,462 కెమెరాలు ఉండటం విశేషం. అయితే మొదటి 20 స్థానాలనూ డ్రాగన్ కంట్రీలోని వివిధ నగరాలు ఆక్రమించాయి. కాగా చైనా రాజధాని బీజింగ్ 21, భారత రాజధాని ఢిల్లీ 22వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications