దేశంలోని మెట్రో నగరాల్లో ఏది బెస్ట్? అంటే అన్నింటికన్నా హైదరాబాద్ ఉత్తమ నగరం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ అక్కడ తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ప్రజలు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి. ఇక ముంబై, చెన్నై మహానగరాల్లో ఉండే ప్రజలు ఏ క్షణంలో సునామీ వస్తుందో, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి.
బెంగళూరు విషయానికొస్తే.. అక్కడ ఎప్పుడు చూసినా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతూ ఉంటుంది. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ వంటి నగరాలలో స్థలాలే దొరకవు, ఒకవేళ దొరికినా ఆ ధరలు మనం భరించలేం. ఎలా చూసుకున్నా దేశంలోని ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాదే బెటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవీ హైదరాబాద్ అడ్వాంటేజెస్...
హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైల్, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం ఉంది. అందుకే దేశంలోని ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్‌ను ఎంచుకోవడానికే పలువురు ఆసక్తి కనబరుస్తుంటారు.
2019 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్‌లో 40 లక్షల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు అమ్ముడుపోయాయి. అలాగే 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి.

ఉద్యోగావకాశాలకూ కొదవ లేదు...
ఏ నగరం అభివృద్ధి విషయంలోనైనా చెప్పుకోవాల్సింది ఉద్యోగావకాశాల లభ్యత. హైదరాబాద్ నగరంలో వీటికి కొదవ లేదు. ఎందుకంటే.. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(వెస్ట్ జోన్) తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు బోలెడు కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలూ మెరుగయ్యాయి. అయితే పెట్టుబడులు అన్నీ ఈ ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా నగరం నలువైపులా సమాంతర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుంది. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10-15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.

ఈస్ట్ జోన్ అభివృద్ధి కోసం...
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర తూర్పు(ఈస్ట్) ప్రాంతం అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లను కూడా ప్రారంభించింది. అంతేకాదు ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే ‘లుక్ ఈస్ట్ పాలసీ'ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది.

అంతర్జాతీయ ప్రమాణాలు, వినూత్న నిర్మాణాలు...
కాస్మోపాలిటన్ కల్చర్‌కి తగ్గట్లుగా హైదరాబాద్‌లో డెవలపర్లు వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. పైగా బిల్డింగ్ సైజు, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నట్లు సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ అంటున్నారు. సరికొత్త సాంకేతికత వినియోగంతో.. ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లతో భాగ్యనగారానికి మరింత అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు.

రెండేళ్లలో బెంగళూరును తలదన్నేలా...
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. ‘‘కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10-15 శాతం ధరలు పెరిగాయి..'' అని ఏషియా పసిఫిక్ ఎండీ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను కనుక పట్టాలెక్కించగలిగితే.. హైదరాబాద్ నగరం వచ్చే రెండేళ్లలో బెంగళూరు మెట్రోను తలదన్నడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications