ఆకాశమే హద్దుగా హైదరాబాద్‌లో భవన నిర్మాణం.. ఏకంగా ముంబైని వెనక్కినెట్టి..
High Rise buildings: తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించడం దగ్గర నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు తనదైన ముద్ర వేస్తూ.. దేశ గ్రోత్ ఇంజిన్ గా వ్యవహరిస్తోంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.
ఇటీవల కోకాపేట్ లో భూవేలం గురించి విని దేశం యావత్తు ముక్కున వేలేసుకుంది. ఎకరం ధర 100 కోట్లు పలికి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే నివాసితుల డిమాండ్ కు అనుగుణంగా భారీ ఆకాశ హర్మ్యాలు(అత్యంత ఎత్తైన భవనాలు) సైతం నిర్మితమవుతున్నాయి.

పలు మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్ కు క్యూ కడుతుండటంతో.. IT కారిడార్ పరిధిలో నిర్మాణాలు ఆకాశమే హద్దుగా కొలువుదీరుతున్నాయి.
పెద్ద సంఖ్యలో బహుళ అంతస్థుల(హైరైజ్) భవనాలు నిర్మితమవుతున్నాయి. ప్రస్తుతం 59 ఫ్లోర్స్ కలిగిన 10 భవనాలు కన్ స్ట్రక్షన్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీని వెనక్కినెట్టి.. హైరైజ్ భవనాలు అధికంగా ఉన్న నగరాల్లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది.
నగర వాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో.. భారీ నిర్మాణ సంస్థలు సైతం ఇక్కడ తమ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే.. గత 3 ఏళ్లలో అనుమతులు పొందిన హైరైజ్ భవనాలన్నీ కోకాపేట్ ఏరియాలో నిర్మాణం జరుగుతున్నాయి. HMDA పరిధిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు IT కారిడార్ లో కలవడంతో పెద్ద సంఖ్యలో విల్లా ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు సైతం ముందుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications