Hyderabad: ద్రవ్యోల్బణం పెరగటంతో చాలా మంది వేతనాలపై బతికేవారి జీవితాలు గందరగోళంలో ఉన్నాయి. దీనికి తోడు వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలోనూ రియల్టీ బూమ్ కొనసాగుతోంది.

తగ్గేదె లే అంటున్న భయ్యర్స్..
హైదరాబాద్ మహానగరంలో 2022లో గృహాల విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో వీటి డిమాండ్ దాదాపుగా 87 శాతం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), ముంబై మెట్రోపాలిటన్ ఏరియా (MMR), బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా కూడా గృహ విక్రయాల్లో పెరుగుదలను నమోదు చేశాయి.

అగ్రస్థానంలో భాగ్యనగరం..
దేశంలోని రియల్టీ రంగంలో చాలా నగరాల కంటే వేగంగా హైదరాబాద్ వృద్ధిని చూస్తోంది. 2022లో విపరీతంగా హౌసింగ్ డిమాండ్ నమోదు కావటం ఇదే సూచిస్తోంది. అనరాక్ తాజా పరిశోధన ప్రకారం 2022లో టాప్-7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు సరికొత్త గరిష్ఠానికి చేరుకున్నాయని వెల్లడైంది. ఇవి 2014 నాటి గరిష్ఠ స్థాయిలను అధిగమించటం విశేషం.

అంకెల్లో అమ్మకాలు..
అనరాక్ డేటా ప్రకారం 2021లో టాప్-7 నగరాల్లో 2,36,500 యూనిట్లు అమ్ముడుకాగా.. 2022లో వీటి సంఖ్య సుమారు 3,64,900 యూనిట్లకు చేరుకుంది. నగరాల పరంగా ముంబై మెట్రోపాలిటన్ సిటీ 2022లో అత్యధికంగా 1,09,700 యూనిట్లను విక్రయించి మెుదటి స్థానంలో నిలవగా.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ రెండవ స్థానంలో 63,700 యూనిట్ల విక్రయంతో నిలిచింది. ఈ రెండు రియల్టీ హాట్‌స్పాట్‌లు మరోసారి ప్రముఖ నివాస మార్కెట్లుగా మారాయి.

కొత్త ప్రాజెక్టులు..
భారత ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ నగరంలో నివాసాలకు రానురాను డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో 2022లో ముంబై, హైదరాబాద్ నగరాలు మాత్రమే గరిష్ఠంగా కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేశాయి. ఈ రెండు నగరాలు సంయుక్తంగా మొత్తం కొత్త లాంచ్‌లలో దాదాపు 54 శాతం వాటాను కలిగి ఉంది.

ANAROCK గ్రూప్ చైర్మన్..
పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లతో సహా అన్ని ఎదురుగాలులు ఉన్నప్పటికీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు 2022 అద్భుతమైన సంవత్సరం అని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి అన్నారు. ఇన్‌పుట్ కాస్ట్, డిమాండ్ పెరగడం వల్ల హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరం 2022లో బలమైన కొత్త హౌసింగ్ సప్లై ఉన్నప్పటికీ టాప్-7 నగరాల్లో Q4 2022లో అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ ఒక శాతం క్షీణించి 6,30,953 యూనిట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని వెల్లడైంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications