త్వరలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందబోతోంది. ఇటీవల ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసే ప్రతిపాదనతో.. ఈ నగరం త్వరలోనే ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 నగరాల జాబితాలో చేరే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

GHMC విస్తరణ వల్ల హైదరాబాద్(Hyderabad) అత్యధిక జనాభా కలిగిన సిటీగా మారుతుంది. ఇది హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మరిన్ని అవకాశాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విస్తరణ వెనుక కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. అవేంటంటే..
మెగాసిటీగా హైదరాబాద్
ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన 'వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ 2025' నివేదిక ప్రకారం.. 2025 నాటికి హైదరాబాద్ జనాభా సుమారు 91 లక్షలుగా ఉండనుంది. దీనితో ఇది ప్రపంచంలో 37వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలబడుతుంది. ఇప్పుడు దీనికి 27 మున్సిపాలిటీలు అదనంగా కలిస్తే.. మొత్తం హైదరాబాద్ జనాభా దాదాపు 1.5 కోట్లకు చేరుకుంటుంది.
ఈ జనాభాతో హైదరాబాద్ ప్రపంచంలో 18వ స్థానానికి చేరుకుని.. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలను సైతం అధిగమించి, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీలలో ఒకటిగా గుర్తింపు పొందుతుంది.
దేశంలో నాలుగో నగరంగా..
ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై తర్వాత ఆరవ అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్.. ఈ విలీనంతో బెంగళూరు, చెన్నైని దాటి రెండు స్థానాలు పైకి చేరుకుంటుంది.
2000 నుంచి 2025 మధ్య హైదరాబాద్ వార్షిక జనాభా వృద్ధి రేటు 1.48%గా నమోదైంది. ఇది భారతీయ నగరాల్లోనే అత్యధికమైన వాటిలో ఒకటి. ఈ వేగవంతమైన వృద్ధి, విస్తరణ.. పెట్టుబడులకు, నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్‌కు భారీ అవకాశాలను సృష్టిస్తుంది. ఈ మెగా విలీనం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ వంటిది.
సవాళ్లు ఇవే..
- జనాభా విస్తరణ వల్ల కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పెరిగే జనాభాకు తగినట్టుగా పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరం.
- విస్తరించిన GHMC పరిధికి మెరుగైన రోడ్డు నెట్‌వర్క్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మెట్రో రైలు విస్తరణ, MMTS సేవలు , ఇంటర్‌సిటీ బస్ కనెక్టివిటీ వంటివి అవసరం. సమగ్ర మాస్టర్‌ప్లాన్‌లో ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది.
- ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)లో.. రోజుకు సుమారు 8,000 నుండి 9,000 టన్నుల చెత్త పోగవుతోంది. విలీనం తర్వాత వ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదలను తట్టుకోవడానికి మరిన్ని రీసైక్లింగ్ కేంద్రాలు, వికేంద్రీకృత వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, వ్యర్థాల వేరుచేసే సెగ్రిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
- అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌లను విస్తరించాలి. మురుగునీటి పారుదల (సీవరేజ్) లైన్లను నిర్మించాలి.
ఏదేమైనా.. GHMC విస్తరణ అనేది హైదరాబాద్ను ఆర్థికంగా, భౌగోళికంగా కొత్త శిఖరాలకు తీసుకువెళ్లినా.. ఈ మెగాసిటీ ఆశయాలను నిలబెట్టుకోవడానికి పటిష్టమైన, సమగ్రమైన ప్రణాళిక అవసరం.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో గుడ్డిగా ఇల్లు కొని మోసపోవద్దు.. అనుమతులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన హైడ్రా..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications