Google: గూగుల్‍కు నోటీసులు..! ఎందుకంటే..
ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ కంపెనీల సర్వీస్ సెంటర్ పేరుతో రెండేళ్ల పాటు నకిలీ కాల్ సెంటర్ నడిపిన కేసులో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రామంతాపూర్ కేంద్రంగా 30 మంది టెలీకాలర్లతో ఈ సెంటర్ నడిపిన మహ్మద్ సలీమ్, మహ్మద్ అరీఫ్‌లను గత వారం పోలీసులు పట్టుకున్నారు.

కృత్రిమ హిట్స్
అయితే వీరు గూగుల్‌నే కేంద్రంగా చేసుకుని ఈ దందా కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు మొదటగా గూగుల్‌లో యాడ్ స్పేస్ కొనడంతో దందా మొదలుపెట్టారు. కృత్రిమ హిట్స్, క్లిక్ ద్వారా అవి సెర్చ్‌లో మొదట కనిపించేలా చేశారు. దీనికి తోడు ఆయా సంస్థలకు చెందిన సర్వీసింగ్ సెంటర్ల చిరునామాలు ఒక చోట ఉండగా... గూగుల్ మ్యాప్‌లో వాటి స్థానాలను మార్చేశారు. కస్టమర్లలో గందరగోళం సృష్టించారు.

అదనంగా వసూలు
దీంతో కస్టమర్లు నెట్ లో వెతికేలా చేసి వారి కాల్ సెంటర్ నంబర్లు కనిపించే చేసి తమ నకిలీ కాల్ సెంటర్ వైపే వాళ్లు మొగ్గేలా చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇలా కస్టమర్ల నుంచి అసలు రేట్లకు 30 నుంచి 40 శాతం అదనంగా వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. ఈ డబ్బులో 60 శాతం వీరు తీసుకుని స్థానికంగా సేవలు వినియోగించుకున్న టెక్నీషియన్‌కు 40 శాతం చొప్పున అందజేశారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు.

గూగుల్ మ్యాప్స్
నిందితులను విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్‌లోని యాడ్ స్పేస్ నిర్వహణ చేసే ఉద్యోగులు, సాంకేతిక నిపుణులను విచారించాలని నిర్ణయించారు. ప్రధానంగా గూగుల్ మ్యాప్స్‌లో వీళ్లు లోకేషన్స్‌ను ఎలా మార్చగలిగారన్న అంశంపై దర్యాప్తు చేయనున్నారు.


Click it and Unblock the Notifications