కస్టమర్లకు చెమటలు పట్టిస్తున్న క్యాబ్ డ్రైవర్లు.. నేటి నుండి 'నో ఏసీ' క్యాంపెయిన్...
గత కొద్దీ రోజులుగా హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ల నిరసనలు రోజురోజుకి తీవ్రతరం అవుతుంది. తాజాగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణాలను బహిష్కరించిన సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం నగరంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుండి 'నో ఎయిర్ కండిషనింగ్ క్యాంపైన్ ' ప్రారంభించారు. ఒక వైపు మండే ఎండల్లో బయటికి వెళ్లాలంటే క్యాబ్ తప్పనిసరి. అయితే ఈ NO AC క్యాంపైన్ పై క్యాబ్ ప్రయకులు తీవ్ర అసహనం వయక్తం చేస్తున్నారు.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ( TGPWU ) అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ తక్కువ ఛార్జీలకు వ్యతిరేకంగా యూనియన్ వివిధ మార్గాల్లో నిరసనలు తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రీపెయిడ్ టాక్సీ ఛార్జీలలాగానే క్యాబ్-అగ్రిగేటర్లు ఏకరీతి ఛార్జీలు అమలు చేయాలని TGPWU డిమాండ్ చేస్తోంది, దీని వల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ ఇంకా డ్రైవర్ సేవలకు న్యాయమైన పరిహారాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత కాలంలో క్యాబ్‌లు ఆటో-రిక్షాల రైడ్ కంటే తక్కువ ధరలు ఛార్జ్ చేస్తున్నాయని, దీని వలన క్యాబ్‌లు నడుపుతున్న వారికి ఆదాయం కష్టమవుతుందని ఆరోపించింది.
అసలు విషయం ఏంటంటే: తెలంగాణ గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ నిరసనలకు అనుగుణంగా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏసీ ఆన్ చేసి క్యాబ్ నడిపించాలంటే ప్రస్తుతం అగ్రగేటర్ సంస్థలు అంటే ఓలా, ఉబర్, రాపిడో తమకు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓలా, రాపిడో, ఉబర్ అగ్రగేటర్ సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఈ నో ఎసి క్యాంపెయిన్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రీపెయిడ్ టాక్సీ ధరలలాగానే ఒకే విధమైన ధరలను అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది.
ఈ క్యాంపైన్ ద్వారా TGPWU క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అర్థం చేసుకోవాలని కస్టమర్లను కోరుతోంది. కస్టమర్లకు అసౌకర్యం కలిగించడం మా ఉద్దేశ్యం కాదని హైలైట్ చేస్తూ రైడ్ సమయంలో AC ఆన్ చేసినందుకు క్యాబ్ డ్రైవర్లకు టిప్పులు ఇవ్వడం పై ఆలోచించాలని యూనియన్ ప్రయాణికులను కోరుతోంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సిటీ ట్రాఫిక్‌లో AC లేకుండా క్యాబ్‌లో ప్రయాణించడం అగ్రిగేటర్ల నుండి సర్వీసెస్ పొందే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుంది.
తెలంగాణ రవాణా శాఖ చర్య: పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉబర్ షటిల్ సేవలపై తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న చర్యకు TGPWU మద్దతును ప్రకటించింది .


Click it and Unblock the Notifications