కేబీఆర్ పార్క్ రూపురేఖలు మారిపోతున్నాయి.. 2028 కల్లా హైదరాబాద్ నడిబొడ్డున అద్భుతం!

హైదరాబాద్ (Hyderabad) సిటీలో ట్రాఫిక్ అంటేనే రోజువారీ నరకం గుర్తొస్తుంది కదూ? ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ రోడ్లపై వెళ్లాలంటే పీడకలలా ఉంటుంది. కానీ, ఇకపై ఆ కష్టాలన్నీ దూరం కాబోతున్నాయి. మన భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తుడిచేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒక భారీ మెగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ దాదాపు రూ. 1,090 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మించబోతున్నారు.

ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 మల్టీ-లెవల్ ఫ్లైఓవర్లు, మరో 7 డీప్ అండర్‌పాస్‌లను ప్లాన్ చేశారు. దీనివల్ల 2028 నాటికి ఈ ప్రాంతమంతా ఎలాంటి సిగ్నల్స్ లేని 'సిగ్నల్ ఫ్రీ కారిడార్'గా మారిపోనుంది. అంటే, ఎక్కడా ఆగకుండా మీ బండిని స్పీడ్‌గా దూకించవచ్చన్నమాట!

Hyderabad Biggest Traffic Upgrade Seven Flyovers And Underpasses Planned Around KBR Park By 2028

ఎక్కడెక్కడ రాబోతున్నాయి?

ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే ఏడు ముఖ్యమైన జంక్షన్లను ఎంచుకున్నారు. అవేంటంటే..

  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్
  • కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్
  • రోడ్ నంబర్ 45 జంక్షన్
  • ఫిల్మ్ నగర్ జంక్షన్
  • మహారాజా అగ్రసేన్ ఐలాండ్
  • క్యాన్సర్ హాస్పిటల్ గేట్
  • ముగ్ధ జంక్షన్

కాంక్రీట్ కాదు.. స్టీల్ మ్యాజిక్!

ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లైఓవర్లను సాంప్రదాయ కాంక్రీట్‌తో కాకుండా 'స్టీల్'తో నిర్మిస్తున్నారు. స్టీల్ స్ట్రక్చర్స్ వల్ల నిర్మాణం చాలా వేగంగా పూర్తవుతుంది. దాంతో పాటు రోడ్లపై రోజూ ప్రయాణించే వారికి నిర్మాణ సమయంలో పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. అధికారులు ఈ పనులను రెండు ఫేజ్‌లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే రెండేళ్లలోనే భారీ మిషనరీతో ఈ పనులన్నీ పూర్తి చేసి, 2028 కల్లా అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.

ముఖ్యమైన విషయం

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ నుండి రోడ్ నంబర్ 36 వైపు వెళ్లేందుకు 4-లేన్ల డబుల్-వే ఫ్లైఓవర్, అలాగే యూసుఫ్‌గూడ నుండి రోడ్ నంబర్ 45 వైపు వెళ్లేందుకు 2-లేన్ల సింగిల్-వే ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. రోడ్ నంబర్ 45 జంక్షన్ దగ్గర చెక్‌పోస్ట్ నుండి దుర్గం చెరువు వైపు వెళ్లడానికి మరో స్టీల్ ఫ్లైఓవర్ రాబోతోంది.

రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెగలు!

ఈ భారీ రోడ్ అప్‌డేట్ వార్త బయటకు రావడంతోనే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా హీటెక్కింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు ప్రయాణ సమయం చాలా తగ్గిపోనుంది. దీనివల్ల ఇక్కడ ఇళ్లకు, ఫ్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి పోష్ ఏరియాల్లో లగ్జరీ ఫ్లాట్లు కొనేందుకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. అలాగే ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ పరిసరాల్లో ల్యాండ్ పార్సల్స్, రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ఏరియాల్లో ఇప్పటికే రేట్లు ఆకాశంలో ఉన్నప్పటికీ, 2028లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి ప్రాపర్టీ వాల్యూస్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏదేమైనా పర్యావరణ ప్రేమికులు కేబీఆర్ పార్క్ లోని పచ్చదనం పాడవకూడదని కోరుకుంటున్నప్పటికీ, సిటీ ట్రాఫిక్ కష్టాలకు ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పక తప్పదు. సిగ్నల్స్ లేకపోవడం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, వాహనాలు ఆగకుండా వెళ్లడం వల్ల పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. మొత్తానికి ఆధునిక టెక్నాలజీతో రాబోతున్న ఈ 7 ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ హైదరాబాద్ (Hyderabad) రూపురేఖలను మార్చడమే కాకుండా, డ్రైవర్లకు పెద్ద ఊరటనివ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+