Sania Mirza Assets: ప్రముఖ భారతీయ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సానియా 15 ఏళ్ల దాంపత్య జీవితాన్ని విషాందాంతంగా ముగించారు. షోయబ్ మరో పెళ్లి చేసుకోవటంతో సానియా ఒంటరయ్యారు. అయితే మాలిక్ మాత్రం పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు.
టెన్నిస్ ప్రపంచంలో సానియా చాలా మంది ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె తన సుదీర్ఘ కెరీర్‌లో 6 మేజర్ మెడల్స్ అందుకున్నారు. ఆమె మహిళల డబుల్స్‌లో నెం-1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. 2003- 2013 మధ్య కాలంలో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం దేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అత్యుత్తమ క్రీడాకారిణిగా కొనసాగారు.

విడాకులపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని వెల్లడించగా.. మరో పక్క ఆమె ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలోను వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది సానియా ఆస్తుల విలువ ఎంత, ఆటగాళ్లు తమ కెరీర్ సమయంలో ఎంత కూడబెట్టగలరనే విషయాలను తెలుసుకోవటానికి ఉచ్చుకత చూపుతున్నారు. 1999లో కెరీర్ ప్రారంభించిన సానియా గట్టిగానే కూడబెట్టారని లెక్కలు చెబుతున్నాయి. టెన్నిస్ క్రీడాకారిణిగా మారిన తర్వాత ఆస్తుల విలువ భారీగానే పెరిగిందని తెలుస్తోంది.
2023 నాటికి సానియా ఆస్తుల మెుత్తం విలువ దాదాపు 26 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ ఏకంగా రూ.210 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆటగాడిగా సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన తర్వాత బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రకటనలు వీరికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతాయి. సానియా విషయంలోనూ అదే జరిగింది. 2015లో ప్రపంచ నెం-1గా ఉన్న సమయంలో ఒక్కో వ్యాపార ప్రకటనకు రూ.60-75 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా సానియా కెరీర్ పీక్స్ సమయంలో.. ప్రముఖ బ్రాండ్స్ కోసం ప్రకటనకర్తగా పనిచేసింది. ఈ లిస్ట్ చూస్తే.. టాటా టీ, టీవీఎస్ స్కూటీ, బోర్న్‌విటా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం జిందా తిలిస్మత్, లాక్మే ఇండియా, లివోజెన్ వంటి బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు. వీటి ద్వారానే ఆమె ఏటా పాతిక కోట్ల వరకు సంపాదిస్తోందని తెలుస్తోంది. ఆమె పేరుపై హైదరాబాదుతో పాటు దుబాయ్ లోనూ ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక కోట్ల విలువైన బ్రాండెడ్ కార్లు ఇతర పెట్టుబడులు కూడా ఆమె కలిగి ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications