ProcureX Technologies: స్టార్టప్ రంగంలో అనేక కొత్త ఆలోచనలతో నేటి తరం యువత తమ సామర్థ్యాలతో కొత్త కంపెనీలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణ రంగంలో సమస్యల పరిష్కరించటానికి ఏఐ టెక్నాలజీతో ముందుకొచ్చిన కంపెనీ ప్రొక్యూర్ ఎక్స్ టెక్నాలజీస్. వాస్తవానికి పూర్తిగా అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉన్న నిర్మాణ రంగంలో ఈ కంపెనీ పెను సంచలనాలు సృష్టిస్తోంది.
వాస్తవానికి నిర్మాణ రంగంలో అవసరమైన వస్తువులు, రిసోర్సెస్ సరిగా వినియోగించుకోకపోవటం ద్వారా 57 శాతం మేర నిర్మాణాలు ఆలస్యమై ఖర్చులను పెంచుతున్నాయి. ఇది రియల్టీ వ్యాపారులకు లాభాలను తగ్గిస్తూ 5 ట్రిలియన్ రూపాయల అదనపు భారాన్ని మోపుతోందని నివేదించబడింది. ఇలాంటి సమస్యలకు ఏఐతో పరిష్కారాలను అందించటానికి తెలుగు యువత నర్సిరెడ్డి, తేజ్ రెడ్డి, భరత్ రెడ్డి ProcureX Technologies స్టార్టప్ కంపెనీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 2024లో తీసుకురాబడిన ఈ కంపెన పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది.

ProcureX అసలు ఏం చేస్తుంది, ఇది నిర్మాణ రంగంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తోందనే వివరాలను పరిశీలిస్తే.. దేశంలోని నిర్మాణ సంస్థల కోసం రూపొందించబడిన సమగ్ర నిర్మాణ నిర్వహణ వేదిక. ఇది ప్రాజెక్ట్ పర్యవేక్షణ, మెటీరియల్ సోర్సింగ్, ప్రణాళిక కోసం ఒక-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. సగజంగా కంపెనీలు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం బహుళ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తాయి. అయితే ఖరీదైన ఈ ప్రక్రియకు స్టార్టప్ ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. ఇది నిర్మాణ రంగంలోని కంపెనీలకు సమయంతో పాటు ఖర్చులను కూడా భారీగా ఆదా చేస్తోంది.
కంపెనీ రియల్ టైంలో ప్రాజెక్టుల పనితీరును నిర్వహిస్తుంది. ఇదే సమయంలో స్టార్టప్ ఏఐ టెక్నాలజీ ఆధారంగా సమయానికి వస్తువులను సేకరించటం ఇన్వెంటరీని మేనేజ్ చేసేందుకు నిర్మాణ సంస్థలకు సహకరిస్తుంది. ప్రత్యక్ష మెటీరియల్ సోర్సింగ్ కోసం భారతదేశం అంతటా విశ్వసనీయ విక్రేతలతో నిర్మాణ కంపెనీలను అనుసంధానించేందుకు కంపెనీ సహాయపడుతుంది. అయితే ఇంత భారీ స్థాయిలో వ్యాపార సామర్థ్యాన్ని సాధించటానికి కంపెనీ ఏఐ మోడల్స్, టూల్స్ వాడుతూ సప్లయర్లతో నిరంతరం ఆర్డర్ల ప్రాసెసింగ్ నిర్వహణను చేపడుతుందని యజమానులు చెబుతున్నారు. దీని వల్ల గంటల తరబడి ప్లానింగ్ కోసం సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.
ఈ వెంచర్ ఇటీవలే మొదటి రౌండ్ నిధుల సేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రముఖ టెక్ రిటైల్ పెట్టుబడిదారులు, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి దాదాపు 1 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. కంపెనీ ప్రారంభానికి ముందు అరవింద్ రెడ్డి కార్పొరేట్ ప్రపంచంలో 15 ఏళ్లు పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ 25 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే ప్రొక్యూర్‌ఎక్స్ హైదరాబాద్‌లోని 10 నిర్మాణ సంస్థలను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసుకుంది. అలాగే దాదాపు 150 సరఫరాదారుల నుంచి సప్లైస్ ప్రొక్యూర్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications