భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బిర్యానీకో, ఐటీ రంగానికో పరిమితం కాకుండా.. ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లోనూ గ్లోబల్ మ్యాప్‌పై మెరిసింది. ప్రతిష్టాత్మక 'కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్' (Cushman & Wakefield) సంస్థ విడుదల చేసిన 'మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2025' నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ ప్రాంతాలు.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్-50 అత్యంత విలువైన షాపింగ్ వీధుల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ కావడం విశేషం.

ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ ప్రాంతాలు ఆసియా పసిఫిక్ జాబితాలో 48వ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక్కడి రిటైల్ స్పేస్ అద్దెలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ సగటు వార్షిక అద్దె చదరపు అడుగుకు 30 యూఎస్ డాలర్లు (దాదాపు మన కరెన్సీలో రూ. 2,680) పలుకుతోంది. ఈ అద్దె ధరలే ఈ వీధులను అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లకు హాట్ స్పాట్‌లుగా మార్చాయి.
బంజారాహిల్స్: లగ్జరీ అడ్రస్
దశాబ్దాలుగా బంజారాహిల్స్ అంటేనే లగ్జరీకి మారుపేరు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, ఖరీదైన బొటిక్స్‌లు, గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్లు, లగ్జరీ కేఫ్‌లు ప్రీమియం కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. డిజైనర్ వేర్ నుంచి హై-ఎండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ల వరకు అన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి. బ్రాండ్ విజిబిలిటీ కోరుకునే అంతర్జాతీయ సంస్థలకు ఇది మొదటి ప్రాధాన్యతగా మారింది.
హిమాయత్‌నగర్: నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కేంద్రం
బంజారాహిల్స్‌తో పోలిస్తే హిమాయత్‌నగర్ శైలి భిన్నం. ఇది ఎప్పుడూ జనంతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ సరసమైన ధరల్లో దొరికే జ్యువెలరీ స్టోర్లు, ఫేమస్ బేకరీలు, బుక్ షాపులు, ఎత్నిక్ వేర్ అవుట్‌లెట్లు ఇలా చాలారకాల భిన్నమైన షాపులు ఉన్నాయి. విభిన్న వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే ఈ వీధి.. రిటైల్ వ్యాపారులకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.
ఈ ర్యాంకింగ్ ప్రాముఖ్యత ఏమిటి?
కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ అనేది కేవలం అద్దె ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకోదు. బ్రాండ్ల ఆసక్తి, ప్రజల రాకపోకలు , వినియోగదారుల ఖర్చు చేసే విధానాన్ని బట్టి ఈ ర్యాంకులు ఇస్తారు. ఆసియాలోని 50 అత్యుత్తమ వీధుల్లో హైదరాబాద్ చోటు దక్కించుకోవడం అంటే.. మన నగర రిటైల్ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని అర్థం.
దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్లు హైదరాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉంది. ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) విలువలు పెరగడంతో పాటు, స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ ట్రెండ్స్ తో పాటు లోకల్ సెంటిమెంట్లను కూడా కలిసి.. హైదరాబాద్ ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా సిటీలోని స్ట్రీట్స్ కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదగడం నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications