Hyderabad: ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు షాకింగ్ వార్త.. ఇక ఆ సర్వీసులు బంద్..

Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ అనేక మంది వ్యాపారవేత్తలు, ప్రజలు ఇతర నగరాలు, దేశాల నుంచి నగరానికి విమాన ప్రయాణం చేస్తూనే ఉంటారు.

ఈ క్రమంలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో యాప్ ఆధారిత క్యాబ్‌లను ఉపయోగించి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు రైడ్‌లు ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రొవైడర్ల వద్ద సేవలకు అంతరాయం ఏర్పడినందున యాప్ ఆధారిత క్యాబ్‌లు అందుబాటులో లేవని వెల్లడైంది.

Hyderabad Airport travel advisary over app based cab services unavailabaility

దీనికి సంబంధించిన వివరాలను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. సర్వీస్ ప్రొవైడర్ల వైపు నుంచి సేవలకు అంతరాయం కారణంగా యాప్ ఆధారిత క్యాబ్‌లు అందుబాటులో లేవని అందులో పేర్కొంది. అయితే దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అవాంతరాలు లేని రవాణా అనుభవాన్ని పొందవచ్చని పేర్కొంది. ముందుగా ట్రావెల్ ప్లానింగ్ సమయంలో కొంత అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచించింది.

విమానాశ్రయానికి, బయటికి రాకపోకలు సాగించేందుకు రేడియో ట్యాక్సీలు, అద్దె కార్లు, ప్రీపెయిడ్ టాక్సీలు, షీ క్యాబ్‌లు, పుష్పక్ బస్సు సర్వీసులు వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించాలని విమానాశ్రయ అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+