real estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ డిమాండ్ భాగ్యనగరానికి ఉందంటే అతిశయోక్తి కాదు. వివిధ నివేదికలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత భూమి విలువ భాగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

బెంగళూరు, ముంబైలను వెనక్కినెట్టి..
రెసిడెన్షియల్ ప్రాపర్టీ విక్రయాల్లో బెంగళూరు, ముంబైలను అధిగమించి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. కొత్త ఇళ్ల అమ్మకాల్లోనూ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా రియాల్టీ విభాగంలో మరోసారి సత్తా చాటింది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధికి ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందిన IT పరిశ్రమతో పాటు పెరుగుతున్న యువ నిపుణులు వంటి అనేక అంశాలు కారణమని చెప్పవచ్చు.

స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్:
మొత్తం 66,683 యూనిట్ల కొత్త లాంచ్ లతో బెంగళూరు, ముంబై, నేవీ ముంబై, చెన్నై సహా ఇతర నగరాలను హైదరాబాదు వెనక్కి నెట్టినట్లు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ప్రాప్ ఈక్విటీ నివేదించింది. 13 శాతం సరఫరా వాటాతో ఆరోగ్యకరమైన, స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ గా నిలిచింది. కాగా 81,849 కొత్త లాంచ్ లతో థానే, 69,525తో పూణేలు వరుసగా మొదటి, రెండవ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

టైర్ 1తో పోలిస్తే టైర్ 2 నథింగ్:
2022లో టైర్ 2 నగరాల్లో నమోదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలతో పోలిస్తే టైర్-1 నగరాల్లో 250 శాతానికి పెగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో అబ్జార్ప్షన్ 4.53 లక్షల యూనిట్లు కాగా.. టైర్ 2 నగరాల్లో 1.83 లక్షల యూనిట్లు మాత్రమేనని పేర్కొంది. అసమాన ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కారణంగా టైర్ 1 నగరాల పట్ల ప్రజల్లో మక్కువ ఎక్కువగా ఉన్నట్లు ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ జసుజా తెలిపారు.


Click it and Unblock the Notifications