Hyderabad: హైదరాబాద్‌లో కొత్త 'షార్ట్ కట్' రోడ్లు! రియల్ ఎస్టేట్ లో తర్వాతి హాట్ స్పాట్స్ ఇవే!
భాగ్యనగరం హైదరాబాద్ (Hyderabad) శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) , మూసీ కారిడార్‌ను కలుపుతూ 7 కొత్త లింక్ రోడ్లను నిర్మించనున్నారు.
ఏయే ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది?
ముఖ్యంగా బుద్వేల్, కొత్తవాల్‌గూడ, , గండిపేట వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఈ కొత్త రోడ్లు వరంగా మారనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక భారీ HMDA లేఅవుట్లు , రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. కొత్త రోడ్ల వల్ల ఈ ప్రాంతాల నుండి సిటీ లోపలికి లేదా విమానాశ్రయానికి వెళ్లడం చాలా సులభం అవుతుంది.

ప్రతిపాదిత 7 కొత్త రోడ్లు ఇవే..
ప్రభుత్వం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కింది రూట్లలో రోడ్లు రాబోతున్నాయి..
- ఒస్మాన్ సాగర్ నుండి నార్సింగి: 5.4 కిలోమీటర్లు (30 మీటర్ల వెడల్పు)
- ఒస్మాన్ సాగర్ నుండి ORR సర్వీస్ రోడ్: 2.3 కిలోమీటర్లు
- కిస్మత్‌పూర్ బ్రిడ్జ్ నుండి బుద్వేల్ లేఅవుట్: 1.1 కిలోమీటర్లు
- బుద్వేల్ లేఅవుట్ నుండి శివమ్ రోడ్: 3.5 కిలోమీటర్లు
- రాజేంద్రనగర్ పోలీస్ క్వార్టర్స్ నుండి ఎయిర్‌పోర్ట్ రోడ్ (శంషాబాద్): 5 కిలోమీటర్లు
- కిస్మత్‌పూర్ బ్రిడ్జ్ నుండి బుద్వేల్ లేఅవుట్ (L-N): 3 కిలోమీటర్లు
- ఇస్తానా విల్లాస్ నుండి గండిపేట రోడ్: 1.2 కిలోమీటర్లు
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
సాధారణంగా ఎక్కడైతే కనెక్టివిటీ పెరుగుతుందో, అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ 7 కొత్త రోడ్ల వల్ల గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో Hyderabad రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత పుంజుకోనుంది. కొత్తగా ఇల్లు లేదా ప్లాట్లు కొనాలనుకునే వారికి ఇవి హాట్ స్పాట్‌లుగా మారనున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం
ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ నుండి నగరం లోపలికి రావాలంటే కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ 7 లింక్ రోడ్లు "షార్ట్ కట్" మార్గాలుగా పనిచేస్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఇంధనం కూడా ఆదా అవుతుంది. 2047 నాటి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్లను డిజైన్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఈ మౌలిక సదుపాయాలు హైదరాబాద్ (Hyderabad) భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ఏడు రహదారుల నిర్మాణం మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ నగరం వెలుపలి వైపు ఏ విధంగా విస్తరించబోతోంది అనే దానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్. సాధారణంగా మెట్రో నగరాల్లో రింగ్ రోడ్లు అభివృద్ధి చెందాక, నగరం లోపలి భాగాలకు, రింగ్ రోడ్డుకు మధ్య కనెక్టివిటీ లేక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడమే ఈ 7 లింక్ రోడ్ల ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారులు రాబోతుండటం వల్ల, మూసీ పరివాహక ప్రాంతం ఒక ఆధునిక అర్బన్ హబ్‌గా మారే అవకాశం ఉంది. 2047 నాటి ట్రాఫిక్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, 100 నుండి 120 అడుగుల వెడల్పుతో ఈ రోడ్లను రూపొందిస్తుండటం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉంది.


Click it and Unblock the Notifications