HVAX Technologies IPO: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కొన్ని గంటల్లోనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి వచ్చిన రెండు ఐపీవోలు బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు పూర్తిగా నిరాశను మిగిల్చాయి. తొలరోజే ఇన్వెస్టర్లకు ఐపీవోలు నేడు షాకింగ్ లిస్టింగ్‌తో ఆందోళనకు గురిచేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది హెచ్వీఏఎక్స్ టెక్నాలజీస్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీ షేర్లు స్వల్పంగా 6 శాతం ప్రీమియం ధరతో లిస్టింగ్ నమోదు చేశాయి. నేడు మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.486 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే ఫ్లాట్ లిస్టింగ్ తర్వాత ఇంట్రాడేలో ఐపీవో షేర్లు దాదాపు 11 శాతం పెరుగుదలను చూశాయి. అయితే సాయంత్రం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్లు 7.42 శాతం లాభంతో మెుదటి రోజు రూ.492 రేటు వద్ద స్థిరపడ్డాయి. కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా నేడు రూ.33.53 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం మార్కెట్లో పూర్తిగా 7.32 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం ఐపీవో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.435-458గా ఉంచింది. ఐపీవోలో బెట్టింగ్ వేసేందుకు లాట్ పరిమాణాన్ని 300 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనేందుకు రూ.1.37 లక్షలు కనీస పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. HVAX టెక్నాలజీస్ ఐపీవో రిటైల్ కేటగిరీ 26.69 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ కేటగిరీ 14.02 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ విభాగం 77.92 రెట్లు బిడ్లు అందుకున్నాయి.
వాస్తవానికి కంపెనీ 2010లో స్థాపించబడింది. కంపెనీ ఫార్మా రంగంలోని తయారీదారులు, హెల్త్ కేర్ సంస్థలకు అవరసమైన టర్న్‌కీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నియంత్రిత పర్యావరణం, క్లీన్‌రూమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజైన్, ఇంజనీరింగ్ అండ్ కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. అలాగే థర్డ్ పార్టీలచే తయారు చేయబడిన.. క్లీన్‌రూమ్ వాల్ ప్యానెల్‌లు, క్లీన్‌రూమ్ సీలింగ్ ప్యానెల్‌లు, కోవింగ్‌లు, రైజర్ ప్యానెల్‌లు, క్లీన్‌రూమ్ తలుపులు, ఫ్లోరింగ్ సిస్టమ్‌లు, పాస్ బాక్స్‌లు, ఎయిర్ షవర్లు, LT/HT ఎలక్ట్రికల్ ప్యానెల్‌లు, ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ గాల్వనైజ్డ్ ఐరన్ నాళాలు, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు, చిల్లర్స్, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ పరికరాలు, యుటిలిటీ ఉత్పత్తి, పంపిణీ పరికరాలను సరఫరా చేస్తుంది. ఇప్పటికే కంపెనీ 15 దేశాల్లో దాదాపు 200 ప్రాజెక్టులను పూర్తి చేసింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications