అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు కారణాల వల్ల దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు.. ఉద్యోగార్థులు క్యూ కడుతున్నారు.
ఓ పక్క జాబ్ మార్కెట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆయా కంపెనీలు ఫ్రెషర్స్ కు ఆఫర్ లెటర్స్ ఇచ్చి మొహం చాటేశాయి. ఇటువంటి సమయంలో విశ్వనగరం హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఓ సంఘటన నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది.

ఒక్క పొజిషన్ వేకెన్సీ ఉండటంతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రకటన ఇచ్చింది. 20 నుంచి 30 మంది రావచ్చని అంచనా వేసింది. కానీ 300కు పైగా ఉద్యోగార్థులు రావడం చూసి కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇటీవల కోల్ కతాలోనూ దాదాపు ఇదే విధంగా జరగ్గా.. ఇప్పుడు ఆ సీన్ భాగ్యనగరంలో రిపీట్ అయింది. విప్రో కార్యాలయం వెలుపల వాక్-ఇన్ ఇంటర్వ్యూ డ్రైవ్ కోసం వేలాది మంది వేచి చూస్తున్న వీడియోలు అప్పుడు బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఇరు ప్రాంతాల్లో బయటకు వచ్చిన ఈ వీడియోలు ఉద్యోగార్థుల దీన స్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications