Ayodhya: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా రామనామ జపం చేస్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ ఘట్టానికి మద్ధతుగా పలు కార్యక్రమాలు జరిగాయి. ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వబోతున్న వేళ.. అక్కడ నిర్వహించిన ఓ ఈవెంట్ గ్రాండ్ హిట్ అయింది.
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో రామ మందిర ప్రతిష్ఠ వేడుక సందర్భంగా భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. వందల మంది టెస్లా కార్ల యజమానుల పెద్ద సమూహం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో మొత్తం 1,100 మంది తమ కార్లతో కలిసి రామ మందిరం చిత్రంతో కూడిన బ్యానర్లు పట్టుకుని పాల్గొన్నారు.

బే ఏరియాకు చెందిన ఆరుగురు హిందూ వాలంటీర్లు.. సన్నీవేల్ నుంచి వార్మ్ స్ప్రింగ్ BART స్టేషన్ వరకు కార్ల ర్యాలీ తలపెట్టారు. పెద్ద రామ రథంతో సాగిన ఈ ర్యాలీ సుమారు 100 మైళ్ల పాటు కొనసాగింది. భద్రత కోసం రెండు పోలీసు కార్లు వెంట వచ్చాయి. చివరికి టెస్లా కార్ లైట్ షోతో ఈ కార్యక్రమం ముగిసింది.
వంశీ రాజనాల సమన్వయంతో 170 రిజిస్టర్డ్ టెస్లా కార్లు గొప్ప ప్రదర్శన చేశాయి. ఈ కార్ల ప్రత్యేక ఫీచర్‌తో చేపట్టిన టెస్లా లైట్ షో పెద్ద హిట్ అయింది. దీనితో పాటు రిథమిక్ ధోల్ బీట్‌లు మరియు రుచికరమైన విందు.. ఈవెంట్‌ను చాలా ప్రత్యేకం చేసినట్లు నిర్వాహకుల్లో ఒకరైన దీపక్ బజాజ్ తెలిపారు. అమెరికాలో హిందువులు నిర్వహించిన తొలి ర్యాలీ ఇదేనని స్పష్టం చేశారు.
రామమందిరాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి అంచనా మించి అద్భుతమైన స్పందన వచ్చిందని నిర్వాహకుల్లో ఒకరైన రోహిత్ శర్మ తెలిపారు. అయితే ఆకస్మిక వర్షం కారణంగా వార్మ్ స్ప్రింగ్ BART స్టేషన్‌తో ర్యాలీని ముగించారు. సుమారు 2 వేల మందికి పైగా రామభక్తులు కాషాయ జెండాలు ఊపుతూ, రామ భజనలతో పాటు డ్రమ్స్ వాయిస్తూ.. ఆ ప్రాంతాన్ని మినీ అయోధ్యగా మార్చేసినట్లు ప్రధాన నిర్వాహకులు దీప్తి మహాజన్ తెలిపారు.


Click it and Unblock the Notifications