Amazon News: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపార కలాపాలను దేశంలో విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీలో పని వాతావరణం అద్వానంగా ఉన్నట్లు మానవ హక్కుల కమిషన్ గుర్తించింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారిపోయింది.
అమెజాన్ తన ఉద్యోగులకు టాయిలెట్ బ్రేక్ కూడా ఇవ్వదని వెల్లడైంది. హర్యానాలోని మనేసర్‌లోని అమెజాన్ ఇండియా వేర్‌హౌస్‌కు సంబంధించిన సమస్యను తనంతట తానే స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. కమిషన్ నివేదిక నిజమైతే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. నివేదిక ప్రకారం అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు తమ పని టార్గెట్ పూర్తయ్యే వరకు టాయిలెట్ బ్రేక్ లేదా వాటర్ బ్రేక్ తీసుకోబోమని ప్రమాణం చేసినట్లు చెప్పబడింది.

ఈ కేసు విచారణ ప్రకారం హర్యానా మనేసర్‌లోని అమెజాన్ ఇండియా గిడ్డంగిలో 24 ఏళ్ల కార్మికుడి నుంచి అన్ని ప్యాకేజీలను దించే వరకు టాయిలెట్‌కు వెళ్లనని ప్రతిజ్ఞ చేయమని అడిగినట్లు వెల్లడైంది. వారి 30 నిమిషాల టీ బ్రేక్ ముగిసిన తర్వాత 24 ఫీట్స్ ఉన్న ఆరు ట్రక్కులను వారి బృందం అన్ లోడ్ చేసే వరకు నీటి కోసం లేదా టాయిలెట్ కోసం విరామం తీసుకోమని ప్రామిస్ చేశారు. పని చేసే స్థలంలో టాయిలెట్ సౌకర్యం లేదని మనేసర్ గోదాంలోని మహిళా ఉద్యోగి తెలిపారు.
దేశంలోని కార్మిక సంఘాలు మనేసర్, చుట్టుపక్కల ఉన్న ఐదు గిడ్డంగులు ఫ్యాక్టరీల చట్టం 1948లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించాయి. రోజుకు 10 గంటలు, వారానికి 5 రోజులు పనిచేసే కార్మికులు రోజుకు నాలుగు ట్రక్కులకు మించి దించలేరని కమిషన్ హైలైట్ చేసింది. అది కూడా 30 నిమిషాల లంచ్ అండ్ టీ బ్రేక్‌తో సహా ఎటువంటి విరామం లేకుండా నిరంతరం పని చేస్తున్నప్పుడు తాను రోజూ 9 గంటల పాటు నిలబడేదానినని ఓ మహిళా ఉద్యోగి పేర్కొన్నారు.
ఆరోపణలపై అమెజాన్ ఇండియా స్పందన..
అమెజాన్ గోదాముల్లో పని పరిస్థితులు దిగజారాయని మానవ హక్కుల కమిషన్ లేఖ రాయటం దేశంలో సంచలనంగా మారింది. దీనిపై అమెజాన్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ తమ ఉద్యోగులు- సహచరుల భద్రత శ్రేయస్సు తమకు మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు. తమ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు పరిశ్రమలో ప్రముఖమైనవి. అవి సురక్షితమైన, సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు.
ఉద్యోగులు- సహచరులు వారు రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడానికి, నీటిని తీసుకోవడానికి లేదా మేనేజర్ లేదా హెచ్‌ఆర్‌తో మాట్లాడటానికి వారి షిఫ్ట్ సమయంలో అనధికారిక విరామం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వెంటిలేషన్ సిస్టమ్‌లు, ఫ్యాన్‌లు, స్పాట్ కూలర్‌లతో సహా తమ అన్ని భవనాల్లో శీతలీకరణ చర్యలు ఉన్నాన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications