ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) హిందూస్తాన్ యూనిలీవర్స్ లిమిటెడ్ మంగళవారం దేశంలోనే మూడో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. రూ.5 లక్షల కోట్లను దాటి మార్కెట్ క్యాప్ (M-Cap) పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత స్థానంలో నిలిచింది. ఈ సంస్థ మొదటిసారి రూ.5 లక్షల కోట్లను అధిగమించింది.

హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలుకు ఆమోదం
గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ మెగా ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది HUL. రూ. 3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలుకు బోర్డు అనుమతి తెలిపినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో HUL షేర్ ధర మంగళవారం 14 శాతం పెరిగి రూ.2.462 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసి చివరకు 13.5 శాతం పెరిగి రూ.2,444.60 వద్ద ముగిసింది. బుధవారం 0.41 శాతం ఎగిసి రూ.2,455కు పెరిగింది. గురువారం 3.34 శాతం పడిపోయి రూ.2,378.65 తగ్గింది.

వీటికి డిమాండ్
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ నడుస్తోంది. ఈ సమయంలో FMCG, ఫార్మా షేర్ల కొనుగోళ్లు పెరిగాయి. వరుసగా 10.4%, 20% ఎగిశాయి. అదే సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనాతో దేశం పోరాటం సమయంలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో షేర్లు పెరుగుతున్నాయి. మంగళవారం నాటి మార్కెట్లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్‌గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర FMCG షేర్లు ఒక్కోటి 5 శాతం నుండి 10 శాతం మధ్య ట్రేడ్ అయ్యాయి.

అంచనాలకు మించి
HUL షేర్లు గత 10 ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 30 శాతం పెరిగింది. దీంతో మంగళవారంతో HUL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.63,000 కోట్లు పెరిగి రూ.5.29 లక్షల కోట్లకు చేరుకుంది. రూ.5 లక్షల మార్కెట్ క్యాప్ దాటిన తొలి కన్స్యూమర్ కంపెనీ ఇదే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన దానికంటే ఏకంగా 62 రెట్లు ఈ షేర్ ధర పలుకుతోంది.

ఎగిసిన షేర్లు
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL)తో పాటు నెస్ట్ల్ ఇండియా షేర్లు బుధవారం 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. గత రెండు నెలల కాలంలో చూస్తే ఎక్కువగా ఎగిసింది హిందూస్తాన్ యూనిలీవర్. FMCG కంపెనీలు నెస్ట్లే, దాబూర్ ఇండియా, బ్రిటానియా, గోద్రోజ్, మారికో, కోల్గేట్ కూడా లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications