దేశీయ అతిపెద్ద నాన్-టుబాకో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ ధరలను మరోసారి పెంచింది. గత నెలలో ధరలు పెంచిన ఈ ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన సంస్థ ఫిబ్రవరిలో రెండోసారి పెంచింది. మార్కెట్ అనలిస్ట్ ఎడెల్విస్ ప్రకారం పాపులర్ పర్సనల్ అండ్ హోమ్ కేర్ బ్రాండ్స్ లక్స్, రెక్సోనా, పాండ్స్, సర్ఫ్ ఎక్సెల్ వంటి సబ్బుల ధరలు పెంచింది. వీటి ధరలను మూడు శాతం నుండి పది శాతం మేర పెంచాయి.
జనవరి నెలలో వీల్ డిటర్జెంట్ అరకిలో ప్యాక్ ధర రూ.31కి, కిలో ధర రూ.62కు పెరిగింది. రిన్ బార్ 250 గ్రామ్ ప్యాక్ ధర రూ.72 నుండి రూ.76కు పెరిగింది. సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర 20 శాతం పెరిగింది. లైఫ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుండి రూ.31కి పెరిగింది. పియర్స్ సబ్బు 125 గ్రామ్స్ ధర రూ.76 నుండి రూ.83కు పెరిగింది. అంతకుముందే డిసెంబర్ నెలలో లైఫ్ బాయ్, లక్స్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ బార్ ధరలను పెంచింది. సెప్టెంబర్ నెలలో 500 గ్రాముల వీల్ రూ.28 కాగా, ఆ నెలలో రూ.29కి, జనవరిలో రూ.31కి పెరిగింది.

ఇక ఫిబ్రవరిలో లక్స్, రెక్సోనా, పాండ్స్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్, విమ్ లిక్విడ్ ధరలు మూడు శాతం నుండి పది శాతం పెరిగాయి. ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం రామెటిరీయిల్స్ ఖర్చు పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్స్ ధరలు పెరిగాయి. గత ఆరు నెలల కాలంలో పర్సనల్, హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications