Telangana: పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ..
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ(Telangana)లో పెట్టుబడులు దాదాపు మూడు రెట్ల పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.18,893.28 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు రూ.49,579.18 కోట్లకు చేరుకున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాల TS-iPASS నివేదిక ప్రకారం, 2021-22లో 4,093 యూనిట్లు స్థాపించారు.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న సంస్థల సంఖ్య 4,602కి పెరిగింది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. 2021-22లో పెట్టుబడుల ద్వారా 1,01,035 మంది పరోక్షంగా, ప్రత్యేక్షంగా ఉపాధి పొందారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,02,105 మందికి ఉపాధి లభించింది.గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాల నుంచి ప్రముఖ దేశీయ తయారీదారుల వరకు తెలంగాణ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.

ఏప్రిల్ 2022లో హైదరాబాద్ లో యునైటెడ్ స్టేట్స్‌లోని తమ ప్రధాన కార్యాలయం వెలుపల గూగుల్ అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించారు. అదే నెలలో హైదరాబాద్‌కు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. జూన్‌లో, గోల్డ్ రిటైలర్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్, రూ.24,000 కోట్ల పెట్టుబడులతో జనరేషన్ 6 అమోలెడ్ డిస్‌ప్లే FABని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలోని అతిపెద్ద బంగారు, వజ్రాల రిటైల్ గొలుసులలో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ రూ.750 కోట్ల పెట్టుబడితో 2,750 ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పించనుంది. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్లలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, మహబూబ్ నగర్ జిల్లాలో 10 సంవత్సరాలలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. జనవరి 2023లో, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రూ.16,000 కోట్ల పెట్టుబడితో మరో మూడు డేటా సెంటర్లతో తన డేటా సెంటర్ పెట్టుబడిని విస్తరించాలని తన ప్రణాళికలను ప్రకటించింది.


Click it and Unblock the Notifications