Mid & Small Caps: గతంలో ప్రజలు ఎక్కువగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మోగ్గు చూపేవారు. కాగా ఇప్పుడు అధిక వడ్డీ వచ్చే ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి. ఆయా రకాల ఫండ్స్‌లో ఇన్‌ప్లో భారీగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికేడాది కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
FY24లో మొత్తం నిర్వహణలోని అసెట్స్‌లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ 59 శాతం వాటాను ఆక్రమించినట్లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. 87 శాతం ఇన్‌ప్లో వీటిలోకే వెళ్లినట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మిడ్ క్యాప్ ఇండెక్స్ 28 శాతంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 34 శాతంతో నిఫ్టీని బీట్ చేసి బంపర్ రిటర్న్స్ ఇచ్చినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 71 శాతంగా ఉన్న ఇన్‌ఫ్లో ఈ ఏడాది 17 శాతం పెరిగినట్లు వివరించింది.

జెఫరీస్ ప్రకారం.. ఇతర విభాగాలతో పోలిస్తే కరోనా అనంతరం స్మాల్ క్యాప్ ఫండ్స్ AUM విపరీతంగా పెరిగింది. మిడ్ క్యాప్ అసెట్స్ 30.2 నుంచి 34.8 శాతం ఎగబాకగా.. స్మాల్ క్యాప్స్ 13.9 నుంచి 23.7 శాతానికి జంప్ చేసి. దీంతో మిడ్ క్యాప్ 5 శాతం, స్మాల్ క్యాప్ 10 శాతం మేర వృద్ధి సాధించగలిగాయి. అయితే ఇటీవల ఈ పరిస్థితి కొంత తగ్గుముఖం పట్టింది. అయినా ఇప్పటికీ స్మాల్ క్యాప్ హవా కొనసాగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
గత ఐదేళ్ల యావరేజ్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ 7 శాతం అధిక ఇన్‌ఫ్లో కలిగి ఉండగా.. మిడ్ క్యాప్ మాత్రం అయిదేళ్ల క్రితం సగటుకు తిరిగి చేరుకుంది. 2018, 2022లో నిఫ్టీ పీక్ స్థాయిలను టచ్ చేయగా.. మిడ్ క్యాప్ ఇప్పుడు దాన్ని ఫాలో అవుతుంది. అయితే స్మాల్ క్యాప్స్ ఇప్పటికే పీక్ రేంజ్‌ను మించి వృద్ధి చెందడంతో సమీప భవిష్యత్తులో పెద్ద స్థాయిలో కరెక్షన్ తప్పదని జెఫరీస్ భావిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications