భువనగిరి, సంగారెడ్డిలో HSIL రూ.320 కోట్ల పెట్టుబడి, మరిన్ని ఉద్యోగాలు..
తెలంగాణలో రూ.320 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు గ్లాస్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్ ఉత్పత్తుల కంపెనీ HSIL బుధవారం వెల్లడించింది. రూ.220 కోట్లతో భువనగిరిలో HSILకు చెందిన ఏఐజీ గ్యాస్ ప్యాక్ ప్రాంగణంలో కొత్తగా స్పెషాలిటీ గ్లాస్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం రెండేళ్లలో(2022 సెప్టెంబర్) నాటికి పూర్తి చేసి, ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 15 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కొత్త ప్లాంటులో రోజుకు 150 టన్నుల సామర్థ్యం ఉండనుందని HSIL వైస్ చైర్మన్ సందీప్ సోమానీ తెలిపారు.
ఈ కార్డుతో ఉచితంగా లేదా తక్కువ ధరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!

ఎగుమతులు
ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై-ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిల్స్‌ను తయారు చేస్తారు. ఫర్నేస్‌తోపాటు ఐదు తయారీ లైన్స్ ఏర్పాటు కానున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకూ ఎగుమతి చేయనున్నారు. ఈ యూనిట్ నుండి ప్రధానంగా ఎగుమతులు ఉంటాయని సందీప్ సోమానీ తెలిపారు. ఫార్మా, కాస్మోటిక్స్ తయారీ కంపెనీల నుండి స్పెషాలిటీ గ్లాస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు.

సంగారెడ్డిలో మరో రూ.100 కోట్లు
రూ.100 కోట్లతో సంగారెడ్డిలోని HSIL ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్ ఉత్పత్తుల ప్లాంటు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. 2022 సెప్టెంబర్ నాటికి దీనిని కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తి 30,000 టన్నులుగా ఉంది. ఈ పెట్టుబడితో 48,000 టన్నులకు పెరుగుతుంది. కరోనా నేపథ్యంలోను సీపీవీసీ, యూపీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని, దీనిని పరిగణలోకి తీసుకొని సంగారెడ్డి ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

మరిన్ని ఉద్యోగ అవకాశాలు
ఏజీఐ గ్లాస్ ప్యాక్ ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌తో పాటు భవనగిరిలో ప్లాంటుని ఏర్పాటు చేసింది. ఏఐజీ 1972లో ప్రారంభమైంది. ఇక్కడి ప్లాంటులో 3వేలమంది ఉద్యోగులు ఉన్నారు. 5 నుండి 4వేల మిల్లీ లీటర్ల సామర్థ్యం గల బాటిల్స్ తయారు చేస్తోంది. రోజుకు 1600 టన్నుల కంటైనర్ గ్లాస్‌ల తయారీ సామర్థ్యం ఉంది. వార్షిక ఆదాయం రూ.1300 కోట్లుగా ఉంది. భువనగిరి ప్లాంట్, సంగారెట్టి ప్లాంట్ ద్వారా స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి.