ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ రంగం పన్ను విధానంపై కీలకమైన చర్చలు జరుగుతున్న సంగతి విదితమే. కేంద్ర ప్రభుత్వం వస్తువులు, సేవల పన్ను (GST) స్లాబ్‌లను పునర్వ్యవస్థీకరించాలని పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (Internal Combustion Engine) వాహనాలపై పన్నులను తగ్గించే ఆలోచనలో ఉందని సమాచారం. ఈ నిర్ణయం అమలు అయితే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారులు సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని HSBC ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం EVలకు ధరల పరంగా మంచి మార్కెట్ ఉంది. పెట్రోల్, డీజిల్ వాహనాలపై అధిక పన్నులు ఉండటంతో వాహనదారులకు EVలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వము ICE vehiclesపై GSTను తగ్గిస్తే ఆ ధరల వ్యత్యాసం తగ్గిపోతుంది. దీంతో వినియోగదారులు మళ్లీ సాంప్రదాయ వాహనాలవైపు మొగ్గుచూపే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఇది EVల పెరుగుతున్న మార్కెట్ వాటాను తగ్గించవచ్చని HSBC విశ్లేషకులు స్పష్టంగా పేర్కొన్నారు.

చిన్న కార్లపై GSTను ప్రస్తుత 28 శాతం నుండి 18 శాతానికికు తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద కార్లకు మాత్రం ప్రత్యేకమైన 40 శాతం రేటును అమలు చేసే అవకాశం ఉంది. దీని వలన చిన్న కార్ల ధరలు దాదాపు 8 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. పెద్ద మోడళ్ల ధరలు కూడా 3-5 వరకు తక్కువ కావచ్చు. ఇలాంటి పన్ను తగ్గింపు ద్విచక్ర వాహన తయారీదారులకు, ముఖ్యంగా దేశీయ బ్రాండ్లకు, లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే, ప్రభుత్వం USD 4-5 బిలియన్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి రావచ్చు.
మరో కోణం ఏంటంటే అన్ని వాహన వర్గాలకు ఒకే విధంగా GSTను 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుత సెస్ అలాగే కొనసాగుతుంది. దీని ఫలితంగా వాహన ధరలు 6-8 శాతం తగ్గుతాయి. వినియోగదారులకు ఇది పెద్ద ఉపశమనం కానప్పటికీ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి పడుతుంది. HSBC అంచనా ప్రకారం.. ఈ విధానం వల్ల USD 5-6 బిలియన్ల ఆదాయం నష్టం కలుగుతుంది. అదనంగా, EVలకు ఉన్న ధరల ప్రయోజనం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
మరో కోణంలో.. ఫ్లాట్‌గా పన్నులను తగ్గించి సెస్‌ను కూడా తొలగిస్తే పన్ను వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. అయితే దీని మూలంగా ప్రభుత్వం ఆటోమొబైల్ రంగం నుండి దాదాపు సగం GST ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది.ఈ మూడు కోణాల్లో ఏదైనా అమలు చేసినా ICE వాహనాలకు కొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ పెరుగుతుంది. తయారీ రంగంలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు, భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు తీసుకున్న పెద్ద అడుగుకు ఆటంకం కలిగించే ప్రమాదం కూడా ఉందని నివేదికలో HSBC హెచ్చరించింది.
భారత ఆటో రంగం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఒక వైపు EVల వృద్ధి, మరోవైపు ICE వాహనాలపై పన్ను తగ్గింపుల ద్వారా వచ్చే ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications